Moviesసీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్‌... గుట్టు ర‌ట్టు

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్‌… గుట్టు ర‌ట్టు

క‌రోనా టైంలో చాలా మంది స్టార్ హీరోల పెళ్లిళ్లు సైతం చాలా సింపుల్‌గా గ‌ప్‌చుప్‌గా చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఎంత పెద్ద గొప్ప హీరో, హీరోయిన్లు అయినా కూడా 50 – 100 మంది స‌మ‌క్షంలోనే పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్‌లో రానా, నితిన్‌, నిఖిల్‌, దిల్ రాజు రెండో పెళ్లి అన్ని కూడా క‌రోనా వేళ పెద్ద హ‌డావిడి లేకుండానే జ‌రిగిపోయాయి. ఇదిలా ఉంటే ఓ టాలీవుడ్ హీరోయిన్ సైతం క‌రోనా వేళ ఎవ్వ‌రికి తెలియ‌కుండా గ‌ప్‌చుప్‌గా పెళ్లి చేసుకుంది.

 

అయితే ఆమె పెళ్లి ఆగ‌స్టులోనే అవ్వ‌గా ఈ విష‌యం ఎవ్వ‌రికి తెలియ‌దు. తాజాగా ఆ హీరోయిన్ త‌న భ‌ర్త ఇత‌డే అని సోష‌ల్ మీడియాలో ఫొటో పెట్టే వ‌ర‌కు ఎవ్వ‌రికి తెలియ‌దు. తెలుగులో త‌నీష్ ప‌క్క‌న మేము వయసుకు వచ్చాం సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది నీతి టేల‌ర్‌. ఆ త‌ర్వాత ఆమె పెళ్లి పుస్త‌కం సినిమాలో కూడా న‌టించింది. సినిమా హీరోయిన్‌గా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో ఆ త‌ర్వాత ఆమె బుల్లితెర‌పై పాపుల‌ర్ నటి అయ్యింది.

 

 

ఈ క్ర‌మంలోనే ఆమె ఆగ‌స్టు 13న కోవిడ్ నిబంధ‌న‌ల మ‌ధ్య త‌న ప్రియుడు ప‌రీక్షిత్‌ను పెళ్లి చేసుకున్న‌ట్టు తాజాగా ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఏదేమైనా నీతి టేల‌ర్ మొత్తానికి ఎవ్వ‌రికి చెప్ప‌కుండానే ఓ ఇంటిది అయిపోయింది. ఈ విష‌యం తెలిశాక సినీ వ‌ర్గాలు షాక్‌లో ఉన్నాయి. ఇక కరోనా తగ్గిన తర్వాత అందరికీ రిసెప్షన్ ఇస్తానని నీతి చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news