Newsప్రియురాలి సంతోషం కోసం ప్రియుడు ఆమె భ‌ర్త‌ను ఏం చేశాడంటే.. ముంబైలో...

ప్రియురాలి సంతోషం కోసం ప్రియుడు ఆమె భ‌ర్త‌ను ఏం చేశాడంటే.. ముంబైలో సంచ‌ల‌నం

తాను ఎంతో ఘాడంగా ప్రేమించిన ప్రియురాలి సంతోషం కోసం ఆమె భ‌ర్త‌పైనే దాడి చేశాడు ఓ ప్రియుడు. ముంబైలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. ముంబైకి చెందిన స‌చిన్ యాద‌వ్ అనే వ్య‌క్తికి ఓ యువ‌తితో ప్రేమ వ్య‌వ‌హారం ఉంది. ఆమెకు మ‌రో యువ‌కుడితో పెళ్ల‌యినా  త‌న ప్రియుడితో ఎఫైర్ కంటిన్యూ చేస్తోంది. ప్రియురాలి భర్త ఆమెను హింసిస్తున్నాడని సచిన్‌కు తెలిసింది.

 

దీంతో స‌చిన్ త‌న ప్రియురాలి భ‌ర్త ఓ బ‌ర్త్ డే పార్టీకి వెళ్లాడ‌ని తెలుసుకుని త‌న మిత్రుల‌ను వెంట పెట్టుకుని వెళ్లి మాస్కులు వేసుకుని అత‌డిపై దాడి చేశారు. అనంత‌రం అత‌డి త‌ల‌పై గాయం చేసి అక్క‌డ నుంచి ప‌రార‌య్యారు. బాధితుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తోన్న పోలీసులు నిందితుల‌ను గుర్తు ప‌ట్ట‌క‌పోయినా పార్టీకి వ‌చ్చిన వారిలో కొంద‌రు నిందితుల‌ను గుర్తు ప‌ట్టి పోలీసుల‌కు చెప్పారు.

 

చివ‌ర‌కు పోలీసులు నిందితుల‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. నిందితుడు స‌చిన్ త‌న ప్రేయ‌సి సంతోషం కోస‌మే ఇలా చేశాడ‌ని తెలిసింది. పోలీసులు ఇప్ప‌టికే సచిన్‌,ఆకాశ్‌లను అదుపులోకి తీసుకోగా మూడో వ్య‌క్తి కోసం అన్వేషిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news