Moviesఅల్లు అర్జున్‌కు ఆ హీరోయిన్ అంటే అంత ఇష్ట‌మా... ఎంత పిచ్చో...!

అల్లు అర్జున్‌కు ఆ హీరోయిన్ అంటే అంత ఇష్ట‌మా… ఎంత పిచ్చో…!

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌కు ఇండ‌స్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌నోడి క్రేజ్ అల వైకుంఠ‌పురంలో త‌ర్వాత డ‌బుల్ అయ్యింది. ఇక అల్లు అర్జున్ ఇప్పుడు సౌత్‌లో పాపుల‌ర్ హీరో అయిపోయాడు. గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు తెలుగులో మాత్ర‌మే కాకుండా మ‌ళయాళం, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

 

అటు వెండితెర‌పైనే కాకుండా ఇటు ఫ్యామిలీ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. బ‌న్నీకి ఇద్ద‌రు పిల్ల‌లు. ఇక బ‌న్నీకి సినిమాల్లోకి రావ‌డానికి బాగా ప్రేర‌ణ ఉన్న హీరో ఎవ‌రో కాదు ఆయ‌న మేన‌మామ మెగాస్టార్ చిరంజీవే. చిరంజీవి కోసం తాను ఏం చేయ‌డానికి అయినా రెడీ అని బ‌న్నీ ఎప్పుడూ చెపుతూ ఉంటాడు. చిరంజీవి డాడీ సినిమాలోనే బ‌న్నీ ముందుగా ఓ స్టెప్ వేశాడు.

 

ఇక బ‌న్నీకి ఇష్ట‌మైన హీరోయిన్ బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ రాణీముఖ‌ర్జీ అంట‌. అప్ప‌ట్లో రాణీ ముఖ‌ర్జీ సినిమా వ‌చ్చిందంటే చాలు బ‌న్నీ ప‌దే ప‌దే చూసేవాడ‌ట‌. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే చిరు న‌టించిన ఇంద్ర సినిమా అంటే మ‌నోడికి చ‌చ్చేంత ఇష్టం అట‌. బ‌న్నీ ఫ్రీ టైంలో బుక్స్ చ‌ద‌వ‌డంతో పాటు ఫొటోగ్ర‌ఫీ చేయ‌డం చాలా ఇష్టం అట‌. ప్ర‌స్తుతం బ‌న్నీ న‌టిస్తోన్న పుష్ప రంప‌చోడ‌వ‌రం అడ‌వుల్లో షూటింగ్ జ‌రుపుకుంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news