Moviesఒక‌ప్ప‌టి టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారో.. ఆ గొడ‌వ‌ల‌తోనే కెరీర్ ఖ‌తం..!

ఒక‌ప్ప‌టి టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారో.. ఆ గొడ‌వ‌ల‌తోనే కెరీర్ ఖ‌తం..!

తెలుగులో తొట్టెంపూడి వేణు హీరోగా వ‌చ్చిన వీడెక్క‌డి మొగుడండి సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది శృతీరాజ్‌. త‌మిళ్ అమ్మాయి అయిన శృతీ రాజ్ తెలుగులో త‌న మొద‌టి సినిమాతో పెద్ద‌గా ఆక‌ట్టుకోక‌పోయినా రెండో సినిమాతో ఆమెకు మంచి మార్కులే ప‌డ్డాయి. శ్రీకాంత్ హీరోగా వ‌చ్చిన ఓ చిన‌దాన సినిమాతో ఆమెకు మంచి మార్కులే ప‌డ్డాయి. కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా బాగానే ఆడినా ఆ త‌ర్వాత ఇక్క‌డ శృతీ రాజ్‌కు ఎవ్వ‌రూ అవ‌కాశాలు ఇవ్వ‌లేదు.

 

ఆ త‌ర్వాత ఆమె త‌మిళ్‌, మ‌ళ‌యాళ సినిమాల్లో చిన్న చిన్న సినిమాల్లో న‌టిస్తూ కాలం గ‌డిపేసింది. ఇప్పుడు ఈ ముదురు ముద్దుగుమ్మ అక్క‌డ ప‌లు టాప్ సీరియ‌ల్స్‌లో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఆమె త‌మిళ్‌లో ఆమె ఆగాగు అనే సీరియ‌ల్లో న‌టిస్తోంది. ఈ సీరియ‌ల్ అక్క‌డ పాపుల‌ర్‌. తెలుగులో అమ్మ‌డు రెండు, మూడు సినిమాల‌తోనే మూటా ముల్లు స‌ర్దేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం కొంద‌రితో వ‌చ్చిన విబేధాలే అన్న ప్ర‌చారం అప్ప‌ట్లో వినిపించింది.

 

కొంద‌రు ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌తో పారితోష‌కం విష‌యంలో ఆమెకు గ్యాప్ రావ‌డంతోనే ఆమె తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఎక్కువ కాలం నిల‌దొక్కుకోలేకపోయింద‌ని అంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news