Newsబ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే సోద‌రుడిపై దాడి... తీవ్ర‌గాయాలతో హాస్ప‌ట‌ల్లో

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే సోద‌రుడిపై దాడి… తీవ్ర‌గాయాలతో హాస్ప‌ట‌ల్లో

క‌ర్నూలు జిల్లాలో గ‌త రెండు రోజులుగా రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. రెండు రోజుల క్రిత‌మే నంద్యాల‌లో వైసీపీకి చెందిన నేత‌, న్యాయ‌వాది సుబ్బారాయుడును దారుణంగా హ‌త‌మార్చిన సంఘ‌టన మ‌ర్చిపోక‌ముందే ఇప్పుడు అదే జిల్లాలో ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే సోద‌రుడిపైనే కొంద‌రు దాడి చేశారు. ఈ దాడిలో ఎమ్మెల్యే సోద‌రుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.

 

క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి సోదరుడు ప్రహ్లాదరెడ్డిపై దాడి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రహ్లాదరెడ్డిపై క‌ర్ర‌లు, రాళ్ల‌తో దాడి చేయ‌డంతో ఆయ‌న‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. రెండు వాహ‌నాల్లో వ‌చ్చిన వారు ప్ర‌హ్లాద్‌రెడ్డిపై ఈ దాడి చేశారంటున్నారు. ప్ర‌హ్లాద్ రెడ్డిని వెంట‌నే ఆసుప‌త్రికి త‌రలించారు.

 

సుధాక‌ర్ రెడ్డి, మ‌ణికంఠ అనే వ్య‌క్తులు త‌న‌పై దాడి చేసిన‌ట్టు ప్ర‌హ్లాద్ రెడ్డి చెపుతున్నాడు. ఈ దాడికి ఆర్థిక లావాదేవీలే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news