Politicsమంత్రి ఇలాకాలో టీడీపీ నేత‌ల‌పై దౌర్జ‌న్య‌కాండ‌... మంత్రి నాని పేరు చెప్పి...

మంత్రి ఇలాకాలో టీడీపీ నేత‌ల‌పై దౌర్జ‌న్య‌కాండ‌… మంత్రి నాని పేరు చెప్పి మ‌రీ

ఏపీ మంత్రి కొడాలి నాని ఇలాకా అయిన గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీ నేత‌ల ఇళ్ల‌పై దాడులు జ‌రుగుతున్నాయి. తాజాగా గుడివాడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు ఇంటిపై దుండగుల దాడి చేశారు. గ‌త రాత్రి 20 మంది దండుగులు రాంబాబు ఇంటి గోడ దూకి లోప‌ల‌కు ప్ర‌వేశించారు. మంత్రి నానిపైనే ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడ‌తావా ? అంటూ అరాచ‌కంగా బూతులు తిడుతూ నానా హ‌డావిడి చేశారు.

దీంతో చుట్టుప‌క్క‌ల వారు తీవ్ర భ‌యందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. చుట్టుప‌క్క‌ల వారు ఈ సంఘ‌ట‌న‌ను ఫోన్లో చిత్రీకరిస్తుండగా వారి ఫోన్లు కూడా లాక్కున్నార‌ట‌. ఇక ఈ లోగా పోలీసులకు స‌మాచారం ఇవ్వ‌డంతో దండుగులు సంఘ‌ట‌నా స్థ‌లం నుంచి ప‌రారైన‌ట్టు స్థానికులు చెపుతున్నారు. ఇక ఈ రోజు ఉద‌యం తెలుగుదేశం జిల్లా అధ్య‌క్షుడు బ‌చ్చుల అర్జ‌నుడు ఆధ్వ‌ర్యంలో ఈ సంఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

కొడాలి నాని చంద్ర‌బాబును, లోకేష్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోన్న నేప‌థ్యంలో నిన్న రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి కొడాలి నానిని విమర్శించారు. ఈ నేపధ్యంలోనే ఈ దాడి జరిగిందని తెలుగు దేశం శ్రేణులు చెబుతున్నాయి. ఏదేమైనా మంత్రి కొడాలి ఏ స్టైల్లో బూతులు మాట్లాడ‌తారో ఇప్పుడు ఆయ‌న ఇలాకాలో ఆయ‌న్ను చిన్న మాట అన్నా కూడా వైసీపీ నేతలు నాని పేరు చెప్పి మ‌రీ టీడీపీ నేత‌ల‌పై దౌర్జ‌న్య‌కాండ కొన‌సాగిస్తుండ‌డంతో తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news