Moviesమిల్కీబ్యూటీ అసిస్టెంట్‌గా స్టార్ క‌మెడియ‌న్‌... ఎవ‌రంటే

మిల్కీబ్యూటీ అసిస్టెంట్‌గా స్టార్ క‌మెడియ‌న్‌… ఎవ‌రంటే

మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సుకు చేరువ అయినా కూడా త‌మ‌న్నా ఇప్ప‌ట‌కీ ఏదో ఒక ఛాన్స్‌తో తాను కూడా ఇండ‌స్ట్రీలో ఉన్నాన‌నిపించుకుంటోంది. ప్ర‌స్తుతం గోపీచంద్ సిటీమార్ సినిమాలో ఈ మిల్కిబ్యూటీ న‌టిస్తోంది. ఈ సినిమాలో ఈ అమ్మ‌డు క‌బ‌డ్డీ టీం కోచ్ శ్వేతారెడ్డి పాత్ర చేస్తోంది. ఆమెకు అసిస్టెంట్‌గా స్టార్ క‌మెడియ‌న్ వెన్నెల కిషోర్ న‌టిస్తున్నాడు. గ‌తేడాది ఎఫ్ 2, సైరా సినిమాల్లో నటించిన ఆమె సిటీమార్‌లో గ్లామ‌ర్ డోస్ బాగా పెంచేస్తోంద‌ట‌.

 

కెరీర్ ప‌రంగా ఫేడ‌వుట్ అవుతోన్న ఆమె మ‌ళ్లీ ఫామ్‌లోకి రావాలంటే అందాల ఆర‌బోత త‌ప్ప‌దని డిసైడ్ అయ్యింద‌ట‌. అందుకే ఏ మాత్రం అడ్డు చెప్ప‌కుండా అందాలు ఆర‌బోసేంందుకు ఓకే చెప్పేసింద‌ట‌. ఒక ఈ సినిమాలో లేడీ క‌బ‌డ్డీ జ‌ట్టు కోచ్‌గా సమంత‌, పురుషుల క‌బ‌డ్డీ జ‌ట్టు కోచ్‌గా గోపీచంద్ మ‌ధ్య వ‌చ్చే సీన్లు కూడా కేక పెట్టిస్తాయ‌ట‌. త‌మ‌న్నాకు త‌మ‌న్నా అసిస్టెంట్ వెన్నెల కిషోర్ మ‌ధ్య సీన్లు కూడా ఫుల్ కామెడీతో ఉంటాయంటున్నారు.

 

కంప్లీట్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా వ‌స్తోన్న ఈ సినిమాతో సంప‌త్ నంది ఎలాగైనా హిట్ కొట్టాల‌న్న క‌సితో ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత త‌మ‌న్నా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసే ఎఫ్ 3 సినిమాలో వెంకీకీ జోడీగా న‌టిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news