Moviesవ‌కీల్‌సాబ్ నుంచి సెన్షేష‌న‌ల్ అప్‌డేట్ వ‌చ్చేసింది.. ప‌వ‌న్ ఫ్యాన్స్ జాత‌ర‌

వ‌కీల్‌సాబ్ నుంచి సెన్షేష‌న‌ల్ అప్‌డేట్ వ‌చ్చేసింది.. ప‌వ‌న్ ఫ్యాన్స్ జాత‌ర‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ వకీల్‌సాబ్‌. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ సినిమాకు రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న వ‌కీల్‌సాబ్‌. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమా బ్యాన‌ర్‌తో పాటు టెక్నిక‌ల్ టీం నిపుణులు రేపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే కానుక‌గా ఉద‌యం 9 గంట‌ల 9 నిమిషాల‌కు వ‌కీల్‌సాబ్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఉంటుంద‌ని ఊరిస్తున్నారు.

ఇక ఈ అప్‌డేట్ వ‌చ్చిందో లేదో వెంట‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ జాత‌ర‌కు రెడీ కండి అని సోష‌ల్ మీడియాలో వ‌కీల్‌సాబ్‌ను ఓ రేంజ్‌లో ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే ఈ అదిరిపోయే అప్‌డేట్ ఏంట‌న్న‌ది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌లో పెట్ట‌డంతో అది ఏంట‌నేదానిపై ఎవ‌రికి వారు త‌మ‌కు తోచిన‌ట్టుగా ట్రెండ్ చేస్తున్నారు.

బాలీవుడ్ హిట్ మూవీ పింక్‌కు రీమేక్‌గా వ‌స్తోన్న ఈ సినిమాలో నివేతా థామస్ మరియు అంజలిలు కీ రోల్స్ చేస్తున్నారు. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు. ఇక ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ప‌వ‌న్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news