Moviesబిగ్‌బాస్‌: విడాకుల సీక్రెట్ చెప్పి షాక్ ఇచ్చిన టీవీ 9 యాంక‌ర్‌

బిగ్‌బాస్‌: విడాకుల సీక్రెట్ చెప్పి షాక్ ఇచ్చిన టీవీ 9 యాంక‌ర్‌

టీవీ 9 యాంక‌ర్ దేవి గురించి తెలుగు ప్రేక్ష‌కులు అంద‌రికి తెలిసిందే. టీవీ 9లో దేవి న్యూస్ రిపోర్ట‌ర్‌గా ప‌రిచ‌యం అయినా ఆమె అస‌లు పేరు దేవి నాగ‌వ‌ల్లి. ఆమె త‌న‌ది రాజ‌మండ్రి అని తాను బీకాం వ‌ర‌కు చ‌దువుకున్నాన‌ని చెప్పింది. ఇక ఎప్పుడూ తాను ఎన్నో న్యూస్ సంచ‌ల‌న వార్త‌లు బ‌యట పెట్టినా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వెంట‌నే త‌న‌లో ఏదో తెలియ‌ని భ‌యం వెంటాడుతోంద‌ని దేవి చెప్పింది. ఇక కొంద‌రు రిపోర్ట‌ర్ల‌కు బిగ్‌బాస్ స్క్రిఫ్ట్‌డ్ అన్న సందేహం ఉంటుంద‌ని నాగ్ ప్రశ్నించ‌గా అలా అనుకుంటే నా ఇంట‌ర్వ్యూలు కూడా అలాగే అనుకునే ఛాన్స్ ఉంది క‌దా ? అని చెప్పింది.

 

ఇక తాను హౌస్‌లోకి కేవ‌లం డ‌బ్బు సంపాదించ‌డానికే వ‌చ్చాన‌ని కుండ‌బ‌ద్ద‌ల కొట్టేసింది దేవి. ఇక తాను ఎన్నో నేచుర‌ల్ డిజాస్ట‌ర్స్‌, రియ‌ల్ డిజాస్ట‌ర్స్‌, బాంబ్ బ్లాస్ట్స్ డైరెక్టుగా చూశాన‌ని చెప్పింది. ఇక తాను డిగ్రీ చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతుండ‌గానే న్యూస్ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చాన‌ని చెప్పింది. ఇక త‌న‌ది ఎరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పిన దేవి.. మ్యూచువ‌ల్ డైవ‌ర్స్ కూడా తీసుకున్నామ‌ని చెప్పి షాక్ ఇచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news