Politicsటిక్ టాక్ క‌థ మ‌రోదేశంలో కూడా స‌మాప్తం..!

టిక్ టాక్ క‌థ మ‌రోదేశంలో కూడా స‌మాప్తం..!

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను ఇప్ప‌టికే భార‌త్‌బ్యాన్ చేసింది. భార‌త్ లాంటి పెద్ద మార్కెట్ ఉన్న దేశంలో బ్యాన్ ప‌డ‌డంతో టిక్‌టాక్ విల‌విల్లాడిపోతోంది. ఇక భార‌త్‌తో పాటు ప‌లు దేశాలు సైతం ఇప్ప‌టికే ఈ యాప్‌పై బ్యాన్ విధించాయి. ఈ క్ర‌మంలోనే టిక్‌టాక్‌కు మ‌రో అదిరిపోయే షాక్ త‌గిలింది. టిక్‌టాక్‌ను అమెరికాలో బ్యాన్ చేసేశారు. ఆ దేశంలో కూడా ఈ యాప్ క‌థ ముగిసింది. గ‌త కొంత కాలంగా చైనాపై గుర్రుగా ఉన్న అమెరిక అధ్య‌క్షుడు ట్రంప్ ఈ యాప్ వ‌ల్ల అమెరిక భ‌ద్ర‌త‌కు ప్ర‌మాదం ఉంద‌ని చెప్ప‌డంతో పాటు ఈ యాప్ అమెరికా కార్య‌క‌లాపాలు అమెరికా సంస్థ‌కు అమ్మేయాల‌ని ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు. అందుకు ట్రంప్ గ‌డువు కూడా విధించారు.

TikTok App: Tik Tok launches information hub to address misinformation  about the app - The Economic Times Video | ET Now

ఈ క్ర‌మంలోనే మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్ లాంటి సంస్థ‌లు టిక్‌టాక్ అమెరికా బిజినెస్ కొనే ప్ర‌య‌త్నాలు చేశాయి. అయితే మైక్రోసాఫ్ట్ ఈ రేసు నుంచి త‌ప్పుకోగా ఒరాకిల్ రేసులో నిలిచింది. ట్రంప్ మాత్రం ఒరాకిల్‌, టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ కుదుర్చుకునే ఒప్పందాన్ని తాను ఆమోదించ‌న‌ని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాలో టిక్‌టాక్ పూర్తి కార్యకలాపాలను తమ దేశంలోని సంస్థకే అమ్మేయాలని ట్రంప్ స్పష్టం చేశారు.

Donald Trump disparages his own scientists, promises vaccine very soon -  Times of India

ఈ క్ర‌మంలోనే ట్రంప్ స‌ర్కార్ ఆదివారం నుంచి టిక్‌టాక్‌తో పాటు వుయ్‌చాట్‌పై విధించిన నిషేధాజ్ఞలు అమ‌ల్లోకి వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. దీంతో ఆదివారం నుంచి ఈ యాప్‌ల కార్య‌క‌లాపాలు అమెరికాలో నిలిచిపోనున్నాయి. అన్ని యాప్‌స్టోర్ల నుంచి టిక్‌టాక్‌, వుయ్‌చాట్‌ యాప్‌లను తొలగించాలని కూడా ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news