Moviesస‌న్నీలియోన్ తీర‌ని కోరిక ఇదే

స‌న్నీలియోన్ తీర‌ని కోరిక ఇదే

హాట్ శృంగార తార స‌న్నీలియోన్ ఇప్పుడు దేశంలోనే గూగుల్ సెర్చింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా చూస్తే ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోదీ కంటే కూడా స‌న్నీలియోనే సెర్చింగ్‌లో టాప్ ప్లేసులో ఉందంటే ఆమె కోసం భార‌తీయులు ఏ రేంజ్‌లో సెర్చింగ్ చేస్తున్నారో తెలుస్తోంది. అయితే ఈ శృంగార తార‌కు ఓ తీర‌ని కోరిక ఉందట‌. ఎంతో కాలంగా తీర‌ని కోరిక‌గా ఉన్న ఈ క‌ల‌ను ఆమె ఇటీవ‌లే నిజం చేసుకుంది. స‌న్నీకి మసెరటి లీవెంటే బ్రాండ్ లగ్జరీ కార్ అంటే చాలా ఇష్టమట.

ఈ ల‌గ్జ‌రీ కారు ఖ‌రీదు రు 1.45 కోట్లు. ఈ ల‌గ్జ‌రీ కారును సొంతం చేసుకోవాల‌ని ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తోంద‌ట‌. ఎట్ట‌కేల‌కు ఆ కోరిక‌ను స‌న్నీ ఇన్ని రోజుల‌కు నెర‌వేర్చుకుంది. దీంతో స‌న్నీ ఆ కారుతో మెరిసిపోతూ తెగ మురిసిపోతోంది. ఇక ఈ కారును తాను నిన్నే ఇంటికి తీసుకు వ‌చ్చాన‌ని… ఈ కారు న‌డిపిన ప్ర‌తిసారి చాలా సంతోషంగా ఉంద‌ని మురిసిపోతోంది. ఇక ఈ ఫొటోను స‌న్నీ త‌న ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇక ప్ర‌స్తుతం స‌న్నీ భ‌ర్త‌, పిల్ల‌లుతో సహా అత్తారింట్లోనే అమెరికాలో మ‌కాం వేసింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news