Gossipsఆ ఒక్క‌ కారణంతో చ‌ర‌ణ్ ప‌క్క‌న నో చెపుతోన్న హీరోయిన్లు... !

ఆ ఒక్క‌ కారణంతో చ‌ర‌ణ్ ప‌క్క‌న నో చెపుతోన్న హీరోయిన్లు… !

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాటు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న తండ్రి నటిస్తోన్న ఆచార్య సినిమా కూడా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ – చిరు క‌లిసి న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో బారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాలో చ‌ర‌ణ్ న‌క్స‌లైట్ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ట‌. చ‌ర‌ణ్ మ‌హా అయితే అర‌గంట మాత్ర‌మే క‌నిపిస్తాడ‌ట‌. దీంతో చ‌ర‌ణ్ ప‌క్క‌న హీరోయిన్ రోల్ కూడా కేవ‌లం పావుగంట‌కు మించి ఉండ‌ద‌ని అంటున్నారు.

అస‌లేమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర కావ‌డంతో చ‌ర‌ణ్ ప‌క్క‌న న‌టించేందుకు ఏ హీరోయిన్ కూడా ఒప్పుకోవ‌డం లేద‌ట‌. ముందు గ్లామ‌ర్ డాల్ ర‌ష్మిక మంద‌న్న పేరు అనుకున్నా ఆమె చిన్న పాత్ర కావ‌డంతో నో చెప్పేసింద‌ట‌. కొర‌టాల డైరెక్ట్‌గా అడిగినా కూడా ర‌ష్మిక ఒప్పుకోలేదంటున్నారు. దీంతో సాయిప‌ల్ల‌విని ట్రై చేశార‌ని.. పైగా చ‌ర‌ణ్ న‌క్స‌లైట్ కావ‌డంతో చ‌ర‌ణ్ ప‌క్క‌న సాయిపల్ల‌వి లేడీ న‌క్స‌లైట్‌గా క‌రెక్టుగా సూట్ అవుంద‌నుకున్నా ఆమె ఇప్ప‌టికే రానా విరాట‌ప‌ర్వంలో లేడీ న‌క్స‌లైట్‌గా చేస్తుండ‌డంతో నో చెప్పేసింద‌ట‌.

ఏదేమైనా చ‌ర‌ణ్ ప‌క్క‌న హీరోయిన్ ఛాన్స్ అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. అయితే ఓ వైపు చిరు, పైగా కొర‌టాల లాంటి డైరెక్ట‌ర్ ఉన్నా కూడా ఏ హీరోయిన్ కూడా ఒప్పుకోక‌పోవ‌డానికి ఆ పాత్ర‌కు ప్రాధాన్యం లేక‌పోవ‌డంతో పాటు ఓ సాంగ్‌, 15 నిమిషాలు మాత్ర‌మే ఉండ‌డం కార‌ణం అని తెలుస్తోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news