Moviesసుశాంత్ ఇంట్లో రేవ్ పార్టీల‌కు స్టార్ హీరోయిన్‌.. ఎవ్వ‌రూ ఊహించ‌ని పేరు..!

సుశాంత్ ఇంట్లో రేవ్ పార్టీల‌కు స్టార్ హీరోయిన్‌.. ఎవ్వ‌రూ ఊహించ‌ని పేరు..!

బాలీవుడ్ హీరో సుశాంత్ కేసులో ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఇష్యూలో ఇప్పుడు డ్ర‌గ్ కోణం కూడా బ‌యట ప‌డింది. ఈ క్ర‌మంలోనే సుశాంత్ ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తితో పాటు ఆమె సోద‌రుడు షోవిక్ చ‌క్ర‌వ‌ర్తితో పాటు ప‌లువురు డ్ర‌గ్ పెడ్ల‌ర్‌, డీల‌ర్లును అరెస్టు చేస్తున్నారు. ఇదిలా ఉంటే క‌స్ట‌డీలో ఉన్న రియా మ‌రిన్ని పేర్లు కూడా వెల్ల‌డిస్తోంద‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలు వస్తున్నాయి. సుశాంత్ డ్ర‌గ్ పార్టీల‌కు బాలీవుడ్‌కు చెందిన ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా వ‌చ్చేవార‌ట‌.

సాహో బ్యూటీ రికార్డ్‌.. 50 మిలియన్ల ఫాలోవర్స్ | Shraddha Kapoor crosses a  huge milestone as she crosses 50 million followers on Instagram

సుశాంత్ తో కలిసి చిచోరే సినిమాలో యాక్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ కూడా ఫామ్ హౌస్ లో నిర్వహించే రేవ్ పార్టీలకు వ‌చ్చేద‌ని జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఆమె తెలుగులో ప్ర‌భాస్ సాహొ సినిమా ద్వారా మ‌న‌కు కూడా సుప‌రిచ‌య‌మే. ఇక సుశాంత్ ఫామ్ హౌస్ మేనేజ‌ర్ చెపుతోన్న దానిని బట్టి సుశాంత్ ఇంట్లో రేవ్ పార్టీలకు రియా చక్రవర్తి – సారా అలీఖాన్ – శ్రద్ధాకపూర్ ఎక్కువుగా వ‌చ్చేవార‌ని కూడా జాతీయ మీడియా క‌థ‌నాలు చెపుతున్నాయి.

bollywood heroin shraddha kapoor exclusive photo gallery - Sakshi

ఈ పార్టీల్లో గంజాయి, స్కోకింగ్ పేప‌ర్స్, ఖ‌రీదైన వోడ్కా కూడా తాగేవార‌ట‌. మ‌రి వీరిని కూడా నార్కోటిక్ అధికారులు విచారిస్తారా ? లేదా ? అన్న‌ది చూడాలి. ఏదేమైనా ఈ కేసులో రోజుకో కొత్త పేరు తెర‌మీద‌కు వ‌స్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news