Moviesబిగ్‌బాస్ 4లో సునీత‌... క్లారిటీ వ‌చ్చేసింది..

బిగ్‌బాస్ 4లో సునీత‌… క్లారిటీ వ‌చ్చేసింది..

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంటోన్న బిగ్‌బాస్ 4 సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. సెప్టెంబ‌ర్ 6వ తేదీ సాయంత్రం 6 గంట‌ల నుంచి ఈ షో ప్రారంభ మ‌వుతోంది. ఇప్ప‌టికే హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే అంటూ ఓ 15 మందితో కూడిన లిస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ షోకు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ షోలో సింగ‌ర్ సునీత కూడా ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన‌బోతున్నార‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. సునీత పేరు నెట్టింట్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. దీనిపై సునీత స్పందించారు. నా ప్రియ మిత్రులారా నేను బిగ్‌బాస్ 4 షోలో పాల్గొంటున్నాన‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. నేను ఈ షోలో పాల్గొన‌డం లేదు.. భ‌విష్య‌త్తులో కూడా ఉండ‌ను.. ఫ‌ర్ యువ‌ర్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ అని త‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

సునీత క్లారిటీ ఇవ్వ‌డంతో ఆమె బిగ్ బాస్ 4లో లేద‌న్న విష‌యంపై క్లారిటీ వ‌చ్చేసింది. ఇక క‌రోనా నేప‌థ్యంలో ఈ షో నిబంధ‌న‌ల‌తో పాటు బిగ్ బాస్ ఇంటి నిర్మాణంలో కూడా చాలా మార్పులు, చేర్పులు ఉండ‌బోతున్నాయ‌ట‌. ఈ సారి బిగ్‌బాస్‌లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువుగా ఉండ‌డంతో వారి డామినేష‌నే ఉండ‌నుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news