Gossipsడ్ర‌గ్స్ హీరోయిన్ల గుట్టు ర‌ట్టు.. ర‌కుల్ ప్రీత్‌, సారా ఆలీఖాన్ ఆ...

డ్ర‌గ్స్ హీరోయిన్ల గుట్టు ర‌ట్టు.. ర‌కుల్ ప్రీత్‌, సారా ఆలీఖాన్ ఆ పెద్ద చేప‌లు వీళ్లే

దివంగ‌త బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంతో తెరపైకి వచ్చిన డ్రగ్స్‌ కేసులో మరో సంచలనం వెలుగులోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే ఈ కేసులో మూడు జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌లు ఇన్వాల్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ఈ కేసులో అరెస్టు అయిన రియా చ‌క్ర‌వ‌ర్తి డ్ర‌గ్స్ తీసుకునే ప‌లువురు బాలీవుడ్ ఏ లిస్ట‌ర్ల పేర్ల‌ను ఎన్సీబీకి (నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో) వెల్లడించింది. వీరిలో బాలీవుడ్‌కు చెందిన టాప్ హీరోయిన్లు, హీరోల‌తో పాటు తెలుగు హీరోయిన్ల పేర్లు కూడా ఉన్నాయని టౌమ్స్ నౌ ఓ సంచ‌ల‌న క‌థ‌నం ప్ర‌సారం చేసింది.

Rhea Chakraborty requests Amit Shah for CBI investigation into Sushant  Singh Rajput's death - bollywood - Hindustan Times

ఈ లిస్టు ప్ర‌కారం చూస్తే తెలుగులో నిన్న మొన్న‌టి వ‌ర‌కు స్టార్ హీరోల‌తో వ‌రుస పెట్టి సినిమాలు చేసిన ర‌కుల్ ప్రీత్‌సింగ్ పేరు కూడా ఉంది. ఆమె కూడా డ్ర‌గ్స్ తీసుకుంటుంద‌ని రియా నార్కో అధికారుల‌కు చెప్పింద‌ని స‌మాచారం. అలాగే బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె సారా అలీఖాన్‌, హీరో రణ్‌వీర్‌ సింగ్‌ సన్నిహితురాలు సైమోన్‌ ఖంబట్టా తదితరుల పేర్లు కూడా ఉన్నాయ‌ని తెలుస్తోంది. వీరితో పాటు మ‌రి కొంద‌రు టాప్ హీరోల పేర్ల‌ను కూడా ఆమె చెప్పిన‌ట్టు ఈ క‌థ‌నం చెపుతోంది. ఏదేమైనా తీగ‌లాగే కొద్ది డొంక క‌దులుతున్న‌ట్టు ఈ కేసులో ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో ? చూడాలి.

Sushant Singh Rajput wanted to get married to Sara Ali Khan?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news