Moviesకంగ‌నాపై ప్ర‌కాష్‌రాజ్ సెటైర్లు పేలాయ్‌... ఫైర్‌బ్రాండ్‌కు మంట పెట్టేలా...!

కంగ‌నాపై ప్ర‌కాష్‌రాజ్ సెటైర్లు పేలాయ్‌… ఫైర్‌బ్రాండ్‌కు మంట పెట్టేలా…!

బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత నెపోటిజంపై ఫైర్‌బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది. ఏకంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కూడా టార్గెట్ చేయ‌డంతో ఆమెకు దేశవ్యాప్తంగా ఎంతోమంది నుంచి మ‌ద్ద‌తు వ‌స్తుండ‌డంతో ఆమె సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది. ఇక రెండు రోజుల క్రితం కోలీవుడ్ హీరో విశాల్ సైతం ఆమెకు మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో పాటు ట్విట‌ర్‌లో భ‌గ‌త్‌సింగ్‌తో పోల్చి మ‌ద్దతుగా నిలిచారు.

 

ఇలా ఎంతో మంది ఆమెకు మ‌ద్ద‌తు తెలుపుతున్నా విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ మాత్రం ఆమెపై త‌న‌దైన స్టైల్లో సెటైర్లు వేశారు. ఇవి కంగ‌నాకు మంట పెట్టేలా ఉన్నాయి. ప్ర‌కాష్‌రాజ్ స‌మ‌కాలీన అంశాల‌ను ఆధారంగా చేసుకుని ఎప్పుడూ స్పందిస్తూనే ఉన్నారు. ఆయ‌న ప్ర‌ధాని మోడీని టార్గెట్ చేస్తూ ప‌లుమార్లు సెటైర్లు విసిరారు. ఇక తాజాగా కంగ‌నాను టార్గెట్‌గా చేసుకుని ఒక్క సినిమాతో కంగనా.. తనను తాను రాణి లక్ష్మీ బాయి అని అనుకుంటుంద‌ని ఎద్దేవా చేశారు.

 

అప్పుడు దీపికా పడుకొనే -పద్మావతి, హృతిక్ రోషన్- అక్బర్, షారుఖ్‌ ఖాన్-అశోక, అజయ్ దేవ్‌గన్- భగత్ సింగ్, అమీర్ ఖాన్-మంగల్ పాండే, వివేక్ ఒబేరాయ్- మోదీ.. వీళ్లు కంగ‌నాలా ఆలోచించాలా ? అని అన‌డంతో పాటు సంబంధిత ఫొటోలు కూడా ఆయ‌న ట్వీట్ట‌ర్‌లో ట్యాగ్ చేశారు. మ‌రి ఎవ్వ‌రి విమ‌ర్శ‌కు అయినా వెంట‌నే బదులు ఇచ్చే కంగ‌నా ప్ర‌కాష్‌రాజ్‌కు ఎలా కౌంట‌ర్ ఇస్తుందో ?  చూడాలి.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news