Moviesహీరో అల్లు అర్జున్‌పై పోలీస్ కంప్లైంట్‌

హీరో అల్లు అర్జున్‌పై పోలీస్ కంప్లైంట్‌

ప్ర‌ముఖ సినీన‌టుడు అల్లు అర్జున్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. అల్లు అర్జున్‌తో పాటు పుష్ప సినిమా టీంపై స‌మాచార హ‌క్కు సాధన స్ర‌వంతి ప్ర‌తినిధులు కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించారంటూ ఆదిలాబాద్ జిల్లా నేర‌డిగొండ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు. జిల్లాలోని కుంతాల జ‌ల‌పాతం సంద‌ర్శ‌న‌న‌ను అధికారులు నిలిపివేశారు. అయితే అల్లు అర్జున్ కుటుంబంతో పాటు పుష్ప సినిమా టీం ఈ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ జ‌ల‌పాతాన్ని సంద‌ర్శించ‌డంతో పాటు తిప్పేశ్వ‌ర్‌లో సినిమా షూటింగ్ చేశార‌ని వారు త‌మ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Allu Arjun says he wants a pan-India appeal: 'For which I need to do a  Bollywood film' - regional movies - Hindustan Times

ఈ ఫిర్యాదు స్వీక‌రించిన పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణ అనంత‌ర‌మే కేసు న‌మోదు చేస్తామ‌ని తెలిపారు. ఇదే విష‌య‌మై వీరు ఆదిలాబాద్ డీఎఫ్‌వోకు కూడా ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే ఆయ‌న అందుబాటులో లేక‌పోవ‌డంతో వారు వెనుదిరిగారు. ఇక అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే పుష్ప సినిమాలో న‌టిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం ఆదిలాబాద్ అడ‌వుల్లో జ‌రుగుతుంద‌ని టాక్‌..?

Exclusive: Telugu superstar Allu Arjun talks about being a complete family  man | Filmfare.com

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news