Moviesసూప‌ర్‌... నిశ్శ‌బ్దం ఓటీటీ రిలీజ్‌కు డేట్ లాక్‌

సూప‌ర్‌… నిశ్శ‌బ్దం ఓటీటీ రిలీజ్‌కు డేట్ లాక్‌

స్వీటీబ్యూటీ అనుష్క న‌టించిన నిశ్శ‌బ్దం సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. హేమంత్ మధుకర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా భారీ అంచ‌నాలు ఉన్నాయి. స‌డెన్‌గా క‌రోనా లాక్‌డౌన్‌తో థియేట‌ర్లు మూసి వేయ‌డంతో సినిమా రిలీజ్‌కు బ్రేక్ ప‌డింది. దీంతో ఈ సినిమాను మేక‌ర్స్ డిజిట‌ల్ ప్లాట్ పాంలో నేరుగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక సినీ అభిమానులు కూడా సినిమాల కోసం మొఖం వాచి ఉండ‌డంతో నిశ్శ‌బ్దం ఎప్పుడు వ‌స్తుందా ? అని వెయిట్ చేస్తున్నారు.

 

ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కులు అమోజాన్ ప్రైమ్ కొనుగోలు చేయ‌గా.. రిలీజ్ కోసం డేట్ కూడా లాక్ చేసిన‌ట్టు తెలుస్తోంది. నిశ్శ‌బ్దంను డిజిటల్ ప్రీమియర్ గా అక్టోబర్ 2 నుంచి అందుబాటులోకి తేనున్నట్టు స‌మాచారం. మాధ‌వ‌న్ మేల్ లీడ్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో షాలిని పాండే, అంజలి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ఏఈ చిత్రం మొత్తం 5 భాషల్లో విడుదల కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news