MoviesOTT ఆఫ‌ర్ల కోసం ఎంత‌కు తెగించిందంటే... వెండితెర వేడెక్కాల్సిందే..

OTT ఆఫ‌ర్ల కోసం ఎంత‌కు తెగించిందంటే… వెండితెర వేడెక్కాల్సిందే..

ప్ర‌స్తుతం క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో వెండితెర కంటే బుల్లితెర‌కే ఎక్కువ క్రేజ్ పెరుగుతోంది. ఎప్పుడు అయితే క‌రోనా దెబ్బ‌తో లాక్‌డౌన్ స్టార్ట్ అయ్యి థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయో అప్ప‌టి నుంచి ఓటీటీ సినిమాల‌కు పిచ్చ క్రేజ్ వ‌చ్చేసింది. వ‌రుస‌గా ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రాంగోపాల్ వ‌ర్మ అయితే ఓటీటీ కోస‌మే వ‌రుస‌గా లాక్‌డౌన్‌లో నాలుగైదు సినిమాలు తీసి రిలీజ్ చేయ‌డంతో పాటు మ‌రో రెండు మూడు సినిమాల‌ను ఇప్పుడు లైన్లో పెట్టేశాడు.

ఇక ఓటీటీ సినిమాల‌కు క్రేజ్ పెరిగిపోతుండ‌డంతో ఛాన్సులు లేని హీరో, హీరోయిన్లు ఇప్పుడు ఓటీటీ ఛాన్సుల కోసం దేనికైనా రెడీ అంటున్నారు. అయితే ఓటీటీ ఛాన్సులు రావాలన్నా, వెబ్ సీరిస్‌ల‌లో అవ‌కాశాలు ఉండాల‌న్నా హాట్ హాట్‌గా క‌నిపించ‌క త‌ప్ప‌దు. ఈ క్ర‌మంలోనే ఎలాంటి అవ‌కాశాలు లేని బిగ్‌బాస్ బ్యూటీ నందిని రాయ్ కూడా ఓటీటీపై మెయిన్‌గా దృష్టి పెట్టింది. ఇటీవ‌ల రిలీజ్ అయిన మెట్రో క‌థ‌లు ( ఆహా – తెలుగు)లో బ్రెస్ట్ క్యాన్స‌ర్ పేషెంట్‌గా న‌టించింది. అందులో బ్రాతో మెరుపులు మెరిపించ‌డంతో కాస్త ఆడియెన్స్ ఎట్రాక్ట్ అయ్యారు.

ఇక ఇప్పుడు హాట్ ఫొటో షూట్ల‌తో రెచ్చిపోతోంది. వైట్ బ్రా.. డెనిమ్ జీన్స్ లో నందిని రాయ్ ఇచ్చిన ఫోజు సంచలనంగా మారింది. దీనికి అదిరిపోయే ఓ కొటేష‌న్ కూడా ఇచ్చింది. నువ్వు ఏం ఆలోచిస్త‌న్నావో ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నావో నీ యాటిట్యూడ్ చెపుతుంద‌ని.. మైండ్‌కు యాటిట్యూడ్ మిర్ర‌ర్ లాంటిది అంటూ పెట్టింది. ఏదేమైనా వెండితెర వేడెక్కించేందుకు  ఈ తెలుగ‌మ్మాయి దేనికైనా రెడీ అంటోంది. మ‌రి నందిని ఛాన్స్ ఆశ‌లు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news