Moviesక్రిష్ - ప‌వ‌న్ ప్రి లుక్ వ‌చ్చేసింది.. పోరాట యోధుడు చంపేశాడు

క్రిష్ – ప‌వ‌న్ ప్రి లుక్ వ‌చ్చేసింది.. పోరాట యోధుడు చంపేశాడు

జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా వ‌రుస‌గా ఆయ‌న సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్‌తో సోష‌ల్ మీడియా మార్మోగుతోంది. ఉద‌యం ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ మోష‌న్ పోస్ట‌ర్ వ‌చ్చి సోష‌ల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుండ‌గా.. ఆ వెంట‌నే ప‌వ‌న్ – సురేంద‌ర్ రెడ్డి సినిమాపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఇక మ‌ధ్యాహ్నం ప‌వ‌న్ – క్రిష్ ప్రీ లుక్ పోస్ట‌ర్ కూడా వ‌చ్చేసింది. ఇది ప‌వ‌న్‌కు 27వ సినిమా.

ఇక క్రిష్ సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్‌లో ప‌వ‌న్ చేతికి క‌డియం, వేళ్ల‌కు ఉంగ‌రాలు ఉన్నాయి. న‌ల్ల‌డి డ్రెస్సు పైన పొడ‌వాటి ఎర్ర‌టి కండువా కూడా ఉంది. అయితే ఫేస్ మాత్రం రివీల్ చేయ‌లేదు. లుక్‌లో ప‌వ‌న్ 27వ సినిమాగా పేర్కొన్నారు. ఈ ప్రి లుక్ రిలీజ్ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు క్రిష్ మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారితో 15 రోజులు షూటింగ్ చేశాను.. ఆయ‌న‌తో ఉన్న ప్ర‌తి క్ష‌ణం ఓ మ‌ధుర జ్ఞాప‌కం.. చిర‌స్థాయిగా నిలిచే విజ‌యం కంటికి కనిపిస్తుంది.

మీ ప్రోత్సాహం, మీ స‌హృద‌యం, మీరు ఎప్ప‌ట‌కి ఇలాగే కోట్లాది జ‌నం శుభాకాంక్ష‌లు అందుకోవాలంటూ హ్యాపీ బ‌ర్త్ డే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటూ క్రిష్ ట్వీట్ చేశారు. ఇక ప‌వ‌న్ ఈ సినిమాలో బందిపోటు దొంగ‌గా న‌టిస్తున్నాడు. ప్రీ లుక్‌తో అయితే చంపేశాడ‌నే చెప్పాలి. జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌తో పాటు మ‌రో హీరోయిన్ న‌టిస్తోంది. ఇక ప్రీ లుక్‌తోనే ప‌వ‌న్ పెద్ద పోరాట యోధుడుగా క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. మొత్తానికి క్రిష్ నుంచి మ‌రో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి రేంజ్ సినిమాగా క‌నిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news