Gossipsటాలీవుడ్ నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తోన్న హాట్ ఐటెం బాంబ్‌...!

టాలీవుడ్ నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తోన్న హాట్ ఐటెం బాంబ్‌…!

బాలీవుడ్ హాట్ ఐటెం బాంబ్ ఊర్వ‌శీ రౌతేలాకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న‌దైన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ హీటెక్కిస్తోంది. ఆమెను ఇన్‌స్టాలో ఏకంగా 30 మిలియ‌న్ల మంది ఫాలో అవుతున్నారంటేనే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థ‌మ‌వుతోంది. ఆమెకు నార్త్‌లో అంత పేరున్నా సౌత్‌లో ముఖ్యంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్తే. అయితే తెలుగు వారిని కూడా మెస్మ‌రైజ్ చేసేందుకు ఆమె వెబ్‌సీరిస్‌తో ఎంట్రీ ఇస్తోంది.

 

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తోన్న బ్లాక్ రోజ్ వెబ్‌సీరిస్‌తో ఆమె తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌న అందాల విందు చేయ‌నుంది. కెకె. రాధామోహ‌న్ ఈ వెబ్‌సీరిస్ నిర్మించ‌నున్నాడు. ఇప్ప‌టికే 10 రోజులు షూటింగ్ పూర్త‌య్యింది. ఇక ఊర్వ‌శి ఈ షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే ఆమె తిరిగి ముంబై చెక్కేసింది. అయితే ఆమె ఖర్చులు చూసి మ‌న నిర్మాత‌ల గుండెలు గుబేల్ మంటున్నాయ‌ట‌.

 

ఇక ముందు ఒప్పుకున్న రెమ్యున‌రేష‌న్‌తో పాటు అద‌నంగా కూడా డిమాండ్ చేస్తోంద‌ట‌. స‌ర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఉండాల‌ని నిర్మాత‌లు చెపుతున్నా ఆమె మాత్రం నోవాటెల్లోనే ఉంటాన‌ని కండీష‌న్ పెట్టింద‌ట‌. ఇక షూటింగ్ జ‌రిగే ప్లేస్‌కు వ‌చ్చేందుకు ఆమెకు ప్ర‌తి రోజు బెంజ్ ల‌గ్జ‌రీ కారు ఉండాల్సిందే అని కూడా కండీష‌న్ పెట్టింద‌ట‌. ఈ  డిమాండ్లు తెలుసుకున్న తెలుగు నిర్మాత‌లు ఊర్వ‌శీని తెలుగు సినిమాల్లో పెట్టుకోవ‌డం క‌ష్ట‌మే అని చెవులు కొరుక్కుంటున్నార‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news