Newsఢిల్లీలో దారుణం.. 90 ఏళ్ల వృద్దురాలిపై 37 ఏళ్ల వ్య‌క్తి రేప్‌

ఢిల్లీలో దారుణం.. 90 ఏళ్ల వృద్దురాలిపై 37 ఏళ్ల వ్య‌క్తి రేప్‌

దేశ రాజ‌ధాని ఢిల్లీలో 90 ఏళ్ల వృద్ధురాలిగా ఓ వ్య‌క్తి అత్యాచారానికి పాల్ప‌డిన సంఘ‌ట‌న తీవ్ర సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఢిల్లీ పోలీసులు ఎట్ట‌కేల‌కు ఈ వ్య‌క్తిని అరెస్ట్ చేశారు. వివ‌రాల ప్ర‌కారం ఢిల్లీ చావ్లాలోనా న‌జాఫ్‌గంజ్  ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల వ్య‌క్తి అదే అదే ప్రాంతంలో నివ‌సిస్తున్న 90 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక‌దాడికి తెగ‌బ‌డ్డాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది.

అటు ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు రావ‌డంతో పోలీసులు ఈ కేసును సీరియ‌స్‌గా తీసుకున్నారు. మంగ‌ళ‌వారం ఢిల్లీ క‌మిష‌న్ ఫ‌ర్ ఉమెన్ ( డీసీడబ్ల్యూ )  చీఫ్ స్వాతి మాలివాల్ బాధిత వృద్దురాలిని ప‌రామ‌ర్శించారు. కాగా  ఘ‌ట‌న జ‌రిగిన 24 గంట‌ల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయ‌డం విశేషం. పోలీసుల చ‌ర్య‌ను ప్ర‌శంసిస్తూ ప‌లువురు నెటిజ‌న్లు ట్వీట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news