Moviesటాలీవుడ్‌లో అమ్మాయిల‌కు డ్ర‌గ్స్ ఇచ్చి వాడ‌తారు... శ్రీరెడ్డి చేతిలో లిస్ట్‌

టాలీవుడ్‌లో అమ్మాయిల‌కు డ్ర‌గ్స్ ఇచ్చి వాడ‌తారు… శ్రీరెడ్డి చేతిలో లిస్ట్‌

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత ఈ కేసులో డ్ర‌గ్స్ కోణం కూడా వెలుగు చూసింది. ఆ వెంట‌నే ఈ డ్ర‌గ్ ఇష్యూ క‌న్న‌డ సినిమా ప‌రిశ్ర అయిన శాండ‌ల్‌వుడ్‌ను పాకేసింది. క‌న్న‌డ హీరోయిన్లు సంజ‌న‌, రాగిణి ద్వివేదిల‌ను పోలీసులు ఇప్ప‌టికే అరెస్టు చేశారు. ఇక బాలీవుడ్‌లో అరెస్టు అయిన రియా చ‌క్ర‌వ‌ర్తి ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌, సారా ఆలీఖాన్ పేర్లు కూడా చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక ఈ అంశంపై బాలీవుడ్ కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ శ్రీరెడ్డి ఇప్ప‌టికే ప‌లుసార్లు స్పందించింది. తాజాగా శ్రీ రెడ్డి టాలీవుడ్‌లో కూడా డ్ర‌గ్స్ తీసుకునే వాళ్లు చాలా మందే ఉన్నార‌ని.. వీరిలో హీరోలు కూడా ఉన్నార‌ని ఆమె బాంబు పేల్చింది. ప‌లువురు సెల‌బ్రిటీలు ఇక్క‌డ రేవ్ పార్టీలు పెడుతూ పెద్ద పెద్ద హోట‌ల్స్‌లో పార్టీలు పెట్టుకుంటూ డ్ర‌గ్స్ తీసుకుంటార‌ని చెప్పింది.

అక్క‌డితో ఆగ‌ని శ్రీరెడ్డి అక్క‌డ పార్టీల‌కు వ‌చ్చే అమ్మాయిల‌కు డ్ర‌గ్స్ ఇచ్చి వారిని కూడా వాడుకుంటార‌ని… త‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తే టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ వాడే హీరోల పేర్ల‌తో స‌హా అంద‌రి పేర్లు బ‌య‌ట పెడ‌తాన‌ని కూడా చెప్పింది. ఈ మేర‌కు ఆమె సోష‌ల్ మీడియా ద్వారా ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news