Moviesక‌రోనా దెబ్బ‌కు దొంగ‌గా మారిన న‌టి... ప్రియుడి ఇంటికే క‌న్నం

క‌రోనా దెబ్బ‌కు దొంగ‌గా మారిన న‌టి… ప్రియుడి ఇంటికే క‌న్నం

క‌రోనా సినిమా వాళ్ల జీవితాల‌ను ఎలా దెబ్బ‌తీసిందో చెప్ప‌క్క‌ర్లేదు. ఒక్క సినిమా వాళ్ల‌నే కాదు ఎంతో మంది సామాన్యుల జీవితాలు సైతం క‌రోనా దెబ్బ‌తో రివ‌ర్స్ అయ్యాయి. ఇక సినిమా వాళ్లు త‌మ ఎంజాయ్‌మెంట్ల‌కు బ్రేక్ వేసుకుని బుద్ధిగా ఇళ్ల‌ల్లో ఉంటున్నారు. మ‌రి కొంద‌రు సంపాద‌న లేక ఏం చేయాల్రా బాబు అని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే క‌రోనాతో ఇటు అవ‌కాశాలు లేక‌.. చేతిలో డ‌బ్బులు లేక ఓ న‌టి దొంగ‌త‌నానికి పాల్ప‌డింది. పైగా ఇందుకోసం ఆమె ప్రియుడి ఇంటికే క‌న్నం వేయాల‌ని ప్లాన్ వేసింది.

tamil serial actress suchitra: ప్రియుడితో కలిసి సొంతింటికే కన్నం,  షూటింగ్స్‌ లేక దొంగగా మారిన నటి - tamil serial actress suchitra absconding  after robbing from own house | Samayam Telugu

దేవత సహా పలు సీరియళ్లల్లో నటించిన సుచిత్ర తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె మణికందన్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. మ‌ణికంద‌న్‌కు ఇప్ప‌టికే పెళ్ల‌య్యింద‌ని టాక్‌. అత‌డు ప‌లు టీవీ న‌టుల‌కు కారు డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. అత‌డికి పెళ్ల‌యినా కూడా సుచిత్ర చెన్నైలో అత‌డిలో క‌లిసి ఉంటోంది. క‌రోనా వ‌ల్ల సీరియ‌ల్స్ లేక‌పోవ‌డంతో ఆమె డ‌బ్బుల కోసం విల‌విల్లాడుతోంది. ఈ క్ర‌మంలోనే ప్రియుడు మ‌ణికంద‌న్‌ను రెచ్చ‌గొట్టి అత‌డి త‌ల్లిదండ్రుల ఇంట్లోనే చోరీ చేసేలా ప్లాన్ చేసింది.

News18 Telugu - కరోనా ఎఫెక్ట్.. ఖర్చులకు డబ్బుల్లేక ప్రియుడి ఇంటికే కన్నం  వేసిన నటి.. | Daivamagal serial actress Suchitra absconding after robbing  in her lover house pk- Telugu News, Today's ...

క‌డ‌లూరులో మ‌ణికంద‌న్ త‌ల్లిదండ్రుల ఇంట్లో రు. 50 వేలు, 18 స‌వ‌ర్ల బంగారం చోరీ చేశారు. పోలీసుల విచార‌ణ‌లో మ‌ణికంద‌న్‌, సుచిత్ర ఈ దొంగ‌త‌నం చేసిన‌ట్టు తేలింది. మ‌ణికంద‌న్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న సుచిత్ర కోసం గాలిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news