Gossipsబిగ్‌బాస్ 4 ఎలిమినేష‌న్‌.. డేంజ‌ర్ జోన్లో ఆ ఇద్ద‌రు..!

బిగ్‌బాస్ 4 ఎలిమినేష‌న్‌.. డేంజ‌ర్ జోన్లో ఆ ఇద్ద‌రు..!

బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ ఫ‌స్ట్ వీకెండ్‌కు వ‌చ్చేసింది. ఎపిసోడ్‌లు మాత్రం చ‌ప్ప‌గానే ఉంటున్నాయి. ఫ‌స్ట్ వీక్ ఎలిమినేష‌న్లో గంగ‌వ్వ‌, అభిజిత్‌, మెహ‌బూబ్ దిల్‌సే, అఖిల్ సార్థ‌క్‌, సూర్య కిర‌ణ్‌, సుజాత‌, దివి వైద్య మొద‌టి వారం ఎలిమినేష‌న్ రౌండ్‌లో ఉన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ఓట్ల ఆధారంగా ఇద్ద‌రు కంటెస్టెంట్లు డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరిలో గంగ‌వ్వ ఎప్పుడో సేఫ్ అయిపోయింది. అభిజిత్,  అఖిల్‌, మెహ‌బూబ్ కూడా ఈసారికి ఎలిమినేష‌న్ నుంచి బ‌తికి బ‌ట్ట‌క‌ట్టారు.

ఇక మిగిలిన వారిలో దివి, సుజాత‌, సూర్య‌కిర‌ణ్‌.. నిన్న‌టి ఎపిసోడ్ ముందు వ‌ర‌కు దివికి త‌క్కువ ఓట్లు ప‌డ్డాయి. కానీ ఒక్క ఎపిసోడ్ ఆమె రాత‌నే మార్చేసింది. దివి కూడా నిన్న‌టి ఎపిసోడ్‌తో సైలెంట్ కిల్ల‌ర్ అంటూ ఆమెకు కూడా ఓట్లు బాగానే గుద్దేశారు. ఇక జోర్దార్ సుజాత తొంద‌ర‌పాటు చ‌ర్య‌ల‌తో కాస్త రేసులో వెన‌క‌ప‌డింది. ఇక తొలి రోజు నుంచే ఎవ‌రి మీద ప‌డితే వారిమీద త‌న కోపాగ్నిని ప్ర‌ద‌ర్శించి సూర్య కిర‌ణ్ అప్ర‌తిష్ట మూట గ‌ట్టుకున్నాడు.

 

ఎవ్వ‌రిని మాట్లాడ‌నీయ‌క‌పోవ‌డం కూడా కోప‌వేశాల‌కు గుర‌వ్వ‌డంతో పాటు.. డామినేటింగ్ నేచ‌ర్.. అన్నీ త‌న‌కే తెలుస‌న్న ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న‌తో ఆయ‌న చాలా మందికి దూర‌మ‌య్యారు. అయితే చివ‌రి స్థానాల్లో ఉన్న కంటెస్టెంట్ల మ‌ధ్య ఓట్ల వ్య‌త్యాసంలో పెద్ద తేడా కూడా లేద‌ట‌. మరి ఈ రోజు వ‌ర‌కు ఓటింగ్‌కు టైం ఉండ‌డంతో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అన్న‌ది చూడాల్సి ఉన్నా… జోర్దార్ సుజాత లేదా సూర్య‌కిర‌ణ్‌ల‌లో ఎవ‌రో ఒక‌రు ఎలిమినేట్ అవ్వ‌వ‌చ్చ‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news