Moviesసినిమా వాళ్ల డ్ర‌గ్స్ బండారం బ‌య‌ట పెట్టిన అనికా... ఇండ‌స్ట్రీలో ఒక్క‌టే...

సినిమా వాళ్ల డ్ర‌గ్స్ బండారం బ‌య‌ట పెట్టిన అనికా… ఇండ‌స్ట్రీలో ఒక్క‌టే క‌ల‌క‌లం

సుశాంత్ సింగ్ మృతి త‌ర్వాత బాలీవుడ్‌లో న‌డుస్తోన్న డ్ర‌గ్స్ బండారం బ‌య‌ట ప‌డింది. అక్క‌డ మాఫియాతో పాటు డ్ర‌గ్స్ దందా కూడా ఉంద‌న్న ఆరోప‌ణ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు క‌న్న‌డ సినిమా ఇండ‌స్ట్రీని కూడా డ్ర‌గ్స్ మాఫియా ఉదంతం కుదిపేస్తోంది. ఈ క్ర‌మంలోనే సీక్రెట్‌గా స్మ‌గ్ల‌ర్ల‌తో పాటు డ్ర‌గ్  డీల‌ర్ల నుంచి మ‌త్తు ప‌దార్థాలు కొంటోన్న శాండ‌ల్‌వుడ్ హీరోలు, హీరోయిన్లు, న‌టీమ‌ణులు, సంగీత క‌ళాకారుల పేర్ల‌ను డ్ర‌గ్ డీల‌ర్ అనికా ఎన్‌సీబీ అధికారుల‌కు వెల్ల‌డించిన‌ట్టు తెలిపింది.

డ్ర‌గ్స్‌కు కోడ్ పేరు పెట్టి మ‌రీ తాను స‌ర‌ఫ‌రా చేసిన‌ట్టు అనిక చెప్పారు. త‌న నుంచి మొత్తం 30 మంది సినిమా రంగానికి చెందిన వ్య‌క్తులు డ్ర‌గ్స్ తీసుకున్నార‌ని చెప్పిన ఆమె పేర్ల గుట్టు కూడా ర‌ట్టు చేశారు. అనిక వివ‌రాల ఆధారంగా సాక్ష్యాధారాలను సేకరించిన ఎన్‌సీబీ అధికారులు వారికి నోటీసులను అందించాలని నిర్ణయించారు.

ఎవ‌రీ అనికా.. ఏంటి ఈ సంచ‌ల‌నం :

ప్ర‌స్తుతం క‌న్న‌డ సినిమా ఇండ‌స్ట్రీని కుదిపేస్తోన్న ఈ అనిక అనికా, అనికా డీ, బీమ‌ని అనే రెండు మూడు పేర్ల‌తో చెలామ‌ణి అవుతూ బెంగ‌ళూరులో ఉంటూ సినిమా వాళ్ల‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని తెలుస్తోంది. తమిళనాడులో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును మ‌ధ్య‌లో వ‌దిలేసిన ఆమె బెంగళూరులో ఉద్యోగం కోసం వ‌చ్చి చివ‌ర‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తోంది. ముంబై డ్ర‌గ్ డీల‌ర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆమె ఇంటిపై దాడి చేసి పెద్ద మొత్తంలో డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఆమె ఇచ్చిన వివ‌రాలు చూస్తే క‌ళ్లు బైర్లు కమ్మేలా సినిమా వాళ్లే ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు అనికా క‌న్న‌డ సినిమా ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నంగా మారింది. ఆమె నుంచి ఇంకెంత మంది ప్ర‌ముఖ సినిమా వాళ్ల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయో ? అని వాళ్లంతా టెన్ష‌న్ టెన్ష‌న్‌గా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news