Politicsబ్రేకింగ్‌: టీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి.... జ‌ర్న‌లిస్టు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే...

బ్రేకింగ్‌: టీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి…. జ‌ర్న‌లిస్టు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే వ‌ర‌కు…

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎందిన ఎమ్మెల్యే రామ‌లింగారెడ్డి మృతి చెందారు. ఆయ‌న సిద్ధిపేట జిల్లా నుంచి దుబ్బాక నుంచి అసెంబ్లీకి ప్రాథినిత్యం వ‌హిస్తున్నారు. సోలిపేట రామలింగారెడ్డి గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయ‌న మ‌ర‌ణంతో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి రాక‌ముందు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేచ‌శారు. ఆ త‌ర్వాత కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడిగా మారారు. గ‌తంలో ఉన్న దొమ్మాట‌.. ఆ త‌ర్వాత దుబ్బాక నుంచి నాలుగుసార్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు.

 

ఆయన మృతిపట్ల టీఆర్‌ఎస్‌ నేతలు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హఠాత్మరణంతో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుములుకున్నాయి. ఆయ‌న స్వస్థలం దుబ్బాక మండలం చిట్టాపూర్. ఆయన భార్య సుజాత, కుమారుడు సతీష్ రెడ్డి, కుమార్తె ఉదయశ్రీ ఉన్నారు. 2004 లో మొదటి సరిగా దుబ్బాక నుంచి ఎమ్యెల్యేగా గెలుపొందారు. 2008 ఉప ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. 2009లో ఓటమి అనంతరం 2014, .2019 ఎన్నికల్లో గెలుపొందారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news