Moviesసుశాంత్ కేసు: ఆ రెండు ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్ చెప్ప‌ని రియా...

సుశాంత్ కేసు: ఆ రెండు ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్ చెప్ప‌ని రియా…

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ కేసు విచార‌ణ వేగంగా జ‌రుగుతోంది. సీబీఐ వ‌రుస‌గా రెండో రోజు కూడా రియా చ‌క్ర‌వర్తిని విచారించింది. శుక్ర‌, శ‌నివార‌ల్లో సీబీఐ రియాను సుదీర్ఘంగా విచారించి ప‌లు ప్ర‌శ్న‌లు వేసి ఆన్స‌ర్లు రాబ‌ట్టింది. ఈ రెండు రోజుల్లో ఆమెను సీబీఐ ఏకంగా 50 ప్ర‌శ్న‌ల‌తో హ‌డ‌లెత్తించిన‌ట్టు జాతీయ మీడియా వ‌ర్గాల్లో వార్త‌లు వస్తున్నాయి. తొలి రోజు అయితే రియాకు ఏకంగా చుక్క‌లు క‌న‌ప‌డ్డాయ‌ని అంటున్నారు. రియాను ఎన్ని ప్ర‌శ్న‌లు వేసినా రెండు ప్ర‌శ్న‌ల‌కు మాత్రం ఆమె ఆన్స‌ర్ ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది.

సుశాంత్‌ను మీరు అమితంగా ప్రేమించిన‌ప్పుడు ?  చిన్న చిన్న స్ప‌ర్థ‌ల‌కే అత‌డితో విడిపోవాల‌ని ఎందుకు ? అనుకున్నారు…  ఇక జూన్ 8న సుశాంత్‌కు బ్రేక‌ప్ చెప్పి అత‌డి ఇంటి నుంచి వెళ్లిన రియా ఆ త‌ర్వాత సుశాంత్ ఆమె సోద‌రుడికి మెసేజ్‌లు పెట్టి ఆమె ఆరోగ్యం ఎలా ఉందు క‌నుక్కునే ప్ర‌య‌త్నం చేశాడు ?  అప్పుడు కూడా ఎందుకు రిప్లే ఇవ్వ‌లేదు ?  అని కూడా రియాను సీబీఐ ప్ర‌శ్నించింద‌ని జాతీయ మీడియా టాక్‌. ఇక రియా సుశాంత్ మానసికంగా స‌రిగా లేన‌ప్పుడు అత‌డిని ఎందుకు ప‌ట్టించుకోలేద‌ని కూడా ప్ర‌శ్నించింద‌ట‌.

ఈ ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డం లేదా ?  ఆమె చెప్పిన స‌మాధానాల‌తో సీబీఐ సంతృప్తి చెంద‌క‌పోవ‌డం జ‌రిగింద‌ని తెలుస్తోంది. ఇక శుక్ర‌వారం రియాను సీబీఐ 10 గంట‌లు విచారిస్తే, శ‌నివారం 7 గంట‌లు విచారించింది. ఇక రియాతో పాటు సిద్దార్థ్ పితాని, శామ్యూల్ మిరాండా, కుక్‌, వాచ్‌మెన్‌, రియా తండ్రి ఇంద్ర‌జిత్ చ‌క్ర‌వ‌ర్తిను కూడా సీబీఐ విచారిస్తోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news