Gossipsనిహారిక పెళ్లికి ప‌వ‌న్ అందుకే రాలేదా... ఎట్ట‌కేల‌కు క్లారిటీ...!

నిహారిక పెళ్లికి ప‌వ‌న్ అందుకే రాలేదా… ఎట్ట‌కేల‌కు క్లారిటీ…!

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక ఎంగేజ్మెంట్ పూర్త‌య్యింది. గుంటూరుకు చెందిన జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య – నిహారిక ఒక్క‌టి కానున్నారు. ఈ మెగా డాట‌ర్ ఎంగేజ్మెంట్‌కు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల‌తో పాటు ఇటు వ‌రుడు చైత‌న్య ఫ్యామిలీ నుంచి అంద‌రూ హాజ‌ర‌య్యారు. ఈ ఫంక్ష‌న్లో బ‌న్నీ క‌పుల్‌తో పాటు చెర్రీ క‌పుల్ కూడా హైలెట్ అయ్యారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాక‌పోవ‌డ‌మే కాస్త లోటు అనిపించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నితిన్ ను పెళ్లి కొడుకును చేసిన ఫంక్ష‌న్‌కు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌తో స‌హా క‌లిసి వెళ్లి మ‌రీ ఆశీర్వ‌దించి వ‌చ్చాడు.

 

అలాంటిది సొంత అన్న‌కుమార్తె ఎంగేజ్మెంట్‌కు ఎందుకు రాలేద‌న్న ప్ర‌శ్న‌లు స‌హ‌జంగానే ఉత్ప‌న్న‌మ‌య్యాయి. నెటిజ‌న్లు కూడా ప‌వ‌న్‌కు అన్న కుమార్తె, ఆయ‌న ఫ్యామిలీ కంటే నితినే ఎక్కువ‌య్యాడా ? అన్న ప్ర‌శ్న‌లు కూడా వేశారు. అయితే దీనిపై ఎట్ట‌కేల‌కు క్లారిటీ వ‌చ్చింది. పవన్ కళ్యాణ్ ప్రతీ ఏడాది తొలిఏకాదశి నుంచి కార్తీక మాసంలోని ఏకాదశి వరకు నాలుగు నెలలపాటు చాతుర్మాస దీక్ష చేపడతాడు. ప‌వ‌న్ ప్ర‌స్తుతం కూడా అదే దీక్ష‌లో ఉన్నాడు. నితిన్ ఫంక్ష‌న్‌కు వెళ్లినా ఈ దీక్ష‌లోనే వెళ్లాడు.

 

అయితే ఈ దీక్ష‌లో ఉన్న వారు సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత బ‌య‌ట‌కు రాకూడ‌ద‌న్న నిబంధ‌న ఉంద‌ట‌. అందుకే గురువారం రాత్రి జరిగిన నిహారిక ఎంగేజ్మెంట్ కి పవన్ రాలేదని చెబున్నారు జనసేనాని సన్నిహితులు. ఈ నిబంధ‌న‌కు ఓకే అనుకున్నా మ‌రి ప‌వ‌న్ ఫ్యామిలీని అయినా ఈ ఫంక్ష‌న్‌కు ఎందుకు పంప‌లేదో ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news