Gossipsఎన్టీఆర్ ఫేమ‌స్ డైలాగే బాల‌య్య సినిమా టైటిల్ ..!

ఎన్టీఆర్ ఫేమ‌స్ డైలాగే బాల‌య్య సినిమా టైటిల్ ..!

నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాల టైటిల్స్  ఎంత ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బాల‌య్య టైటిల్స్ అంటే రౌద్రం ఉట్టి ప‌డాల్సిందే. ఇక తాజాగా బాల‌య్య – బోయ‌పాటి కాంబోలో బీబీ 3 సినిమా తెర‌కెక్కుతోంది. వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన సింహా, లెజెండ్ రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ కాంబిన‌ష‌న్లో మూడో సినిమా హిట్ అయ్యి హ్యాట్రిక్ కొడుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమా క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు టైటిల్ కూడా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉండాల‌ని బోయ‌పాటి డిసైడ్ అయ్యారు.

ప‌లు ర‌కాల టైటిల్స్ ప‌రిశీలిస్తున్నా ఏవీ స‌రిగా సెట్ కాలేద‌న్న అసంతృప్తి బోయ‌పాటికి ఉంద‌ట‌. ఇప్ప‌టికే మోనార్క్ టైటిల్ ప‌రిశీల‌న‌కు వ‌చ్చినా అది సెట్ చేయ‌లేదు. ఇక ఇప్పుడు టార్చ్ బెర్ర‌ర్ టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ట‌. ఈ డైలాగ్ ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన అర‌వింత స‌మేత వీర‌రాఘ‌వ సినిమాలో బాగా పేలింది. ఇప్పుడు ఎన్టీఆర్ డైలాగ్‌ను బాల‌య్య సినిమాకు టైటిల్‌గా ప‌రిశీలిస్తున్నారంటే అవి విశేష‌మే.

ఇక ఈ సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేయాల‌ని చూస్తున్నారు. ఇక డ‌బుల్ రోల్లో సీనియ‌ర్ బాల‌య్య ప‌క్క‌న సీనియ‌ర్ హీరోయిన్ సిమ్రాన్ న‌టిస్తుంద‌ని.. రెండో రోల్ ప‌క్క‌న మ‌రో హీరోయిన్‌ను ఎంపిక చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన టీజర్ లో మాత్రం బాలయ్య ఎప్పటిలాగే, పవర్ ఫుల్ డైలాగ్ అండ్ ఫుల్ యాక్షన్ తో… వైట్ అండ్ వైట్ పంచెక‌ట్టులో ఇర‌గ‌దీశాడు. ఏదేమైనా భారీ అంచ‌నాల‌తో వ‌స్తోన్న ఈ సినిమా టైటిల్ ఎప్పుడు ఎనౌన్స్ అవుతుందో అప్ప‌టి వ‌ర‌కు స‌స్పెన్స్ త‌ప్పేలా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news