Gossipsతార‌క్ అభిమానులు కేక పెట్టే న్యూస్‌... హీరోగా ఎన్టీఆర్ బామ‌రిది ఎంట్రీ...!

తార‌క్ అభిమానులు కేక పెట్టే న్యూస్‌… హీరోగా ఎన్టీఆర్ బామ‌రిది ఎంట్రీ…!

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో హీరోల ఫ్యామిలీల నుంచే హీరోలు ఎంట్రీ ఇవ్వ‌డం కామ‌న్ అయిపోయింది. గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా చూస్తే మ‌న తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఐదారు ఫ్యామిలీల హీరోలే వ‌రుస‌గా హీరోలు అవుతున్నారు. ఇక నంద‌మూరి ఫ్యామిలీలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌కు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచే పోటీ హీరో రాబోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే ఎన్టీఆర్ సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్ హీరోగా ఉన్నాడు.

 

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బావ‌మ‌రిది సైతం హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడ‌న్న వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్కెర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస‌రావు కోట్ల‌కు అధిప‌తి. ఆయ‌న ప‌లు రంగాల్లో వ్యాపార‌వేత్త‌గా కూడా ఉన్నారు. ఆయ‌న కుమారుడు నితిన్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఆస‌క్తితో ఉన్నాడ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం నితిన్ క‌థ‌లు వినే ప‌నిలో బిజీ బిజీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ వార్త‌తో ఎన్టీఆర్ అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

 

ఇక స్టార్ హీరోల బావ‌మ‌రుదులు కూడా ఇప్ప‌టికే హీరోలు అయ్యారు. మ‌హేష్ బావ‌మ‌రిది సుధీర్‌బాబు, చ‌ర‌ణ్ బావ‌మ‌రిది క‌ళ్యాణ్‌దేవ్ హీరోలుగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బావ‌మ‌రిది కూడా హీరోగా ఎంట్రీ ఇస్తే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ స‌పోర్ట్ కూడా నితిన్‌కు ఫుల్‌గా ఉంటుంది. అయితే ప్ర‌స్తుతం ఉన్న పోటీలో నితిన్‌కు ఎంత ఎన్టీఆర్ అభిమానుల సపోర్ట్ ఉన్నా.. ఎంత డ‌బ్బున్నా హీరోగా నిల‌దొక్కుకునేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news