Gossipsఆ స్టార్ హీరోతో దిల్ రాజుకు గ్యాప్‌... ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌...!

ఆ స్టార్ హీరోతో దిల్ రాజుకు గ్యాప్‌… ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌…!

క‌రోనా పుణ్య‌మా అని టాలీవుడ్‌లో ప‌లు సినిమాలు రిలీజ్ అవ్వ‌డం లేదు. అనేక సినిమా షూటింగ్‌లు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక ఇప్ప‌టికే ప‌లు చిన్న సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు సైతం రిలీజ్ అయ్యేందుకు థియేట‌ర్లు తెరిచే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో ఓటీటీనే న‌మ్ము కోవాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. అయితే కొంద‌రు హీరోలు మాత్రం త‌మ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయితే త‌మ క్రేజ్ ఎక్క‌డ త‌గ్గుతుందో అని అందుకు ఒప్పుకోవ‌డం లేద‌ట‌.

 

త‌మ సినిమాల‌ను థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చెయ్యాల‌ని చెపుతున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే నాని హీరోగా దిల్ రాజు నిర్మాతగా తెర‌కెక్కిన వి సినిమాను ముందు థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. ఎప్పుడో మార్చి 25న రావాల్సిన ఈ సినిమా కాస్తా వాయిదా ప‌డింది. దీంతో ఇప్ప‌ట్లో థియేట‌ర్లు తెరిచే స్కోప్ లేక‌పోవ‌డం.. తెరిచినా జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తారా ? అన్న‌న సందేహాలు ఉండ‌డంతో .. గ్యాప్ బాగా పెరిగి పోవ‌డంతో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లోనే వీ రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు నిర్ణయానికి వచ్చారు.

 

అయితే ఇది నానికి న‌చ్చ‌డం లేద‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఒక వేళ త‌న‌కు ఇష్టం లేకుండా రాజు ఈ సినిమాను ఓ టీ టీలోనే రిలీజ్ చేస్తే త‌న‌కు సినిమా రెమ్యున‌రేష‌న్ కూడా వ‌ద్ద‌ని ఖ‌రాఖండీగా చెప్పేస్తున్నాడ‌ట‌. ఈ విష‌యం ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో లీక్ కావ‌డంతో చిలువ‌లు ప‌ల‌వ‌లుగా చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఫైన‌ల్‌గా ఈ సినిమా విష‌యంలో రాజు ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news