ఐపీఎల్ 13 దిమ్మ‌తిరిగేలా యాడ్ టారిఫ్‌… 10 సెక‌న్ల యాడ్ రేటెంతో తెలుసా…!

ఐపీఎల్ 13వ సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సీజ‌న్‌కు యాడ్ టారిప్ దుమ్ము రేగిపోతోంది. ఓ వైపు స్పాన్స‌ర్‌షిప్ నుంచి వివో వైద‌లొగితే మ‌రో వైపు ఇత‌ర స్పాన్స‌ర్ల రేట్లు కూడా చాలా త‌క్కువుగా ఉంటున్నాయి. అయినా యాడ్ టారిప్ రేటు విష‌యంలో మాత్రం స్టార్ స్పోర్ట్స్ వెనక్కు త‌గ్గ‌డం లేదు. మ్యాచ్‌ల సందర్భంగా 10 సెకన్ల యాడ్‌కు గాను రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు స్టార్ స్పోర్ట్స్ వసూలు చేయనుంది తెలిసింది.

 

స్టార్ స్పోర్ట్స్ అంచ‌నాలు ఎలా ఉన్నా క‌రోనా క‌రువు కాలంలో అంత అమౌంట్ వ‌స్తుందా ? అన్న‌ది సందేహ‌మే. గ‌తేడాది మ్యాచ్‌ల‌కు గాను స్టార్ స్పోర్ట్స్ రు. 3 వేల కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇప్పుడు అంత‌కు మించి రాబ‌ట్టాల‌ని చూస్తున్నా అది సాధ్య‌మ‌వుతుందా ? అన్న సందేహాలు అయితే ఉన్నాయి. గ‌త‌ ఐపీఎల్ మ్యాచ్‌లకు 424 మిలియన్ల వ్యూయర్‌షిప్ వచ్చింది. టీవీ ప్రేక్షకుల్లో 51 శాతం మంది ఐపీఎల్ మ్యాచ్‌లను చూశారు. అయితే ఈ యేడాది దుబాయ్‌లో ఐపీఎల్ జ‌రుగుతుండ‌డంతో మ‌రింత ఎక్కువ మంది చూస్తార‌న్న అంచ‌నా అయితే ఉంది.

Leave a comment