Politicsరివర్స్ అవుతున్న మూడు: వైసీపీకే ఎఫెక్ట్...టీడీపీని కదపడం కష్టమే... !

రివర్స్ అవుతున్న మూడు: వైసీపీకే ఎఫెక్ట్…టీడీపీని కదపడం కష్టమే… !

రాష్ట్రాభివృద్ధి కోసమని చెప్పి జగన్ మూడు రాజధానులని తెరపైకి తీసుకొచ్చి సరికొత్త రాజకీయానికి తెరలేపిన విషయం తెలిసిందే. అయితే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి గానీ, అధికార వికేంద్రీకరణ మంచిది కాదని, కాబట్టి అమరావతిలోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తోంది. దీంతో మూడు రాజధానులని వ్యతిరేకిస్తూ టీడీపీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటుందని చెప్పి వైసీపీ…ఉత్తరాంధ్ర,రాయలసీమల్లో చంద్రబాబుని నెగిటివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

 

పైగా కొన్ని మీడియా సంస్థలు కూడా మూడు రాజధానుల వల్ల టీడీపీకే పెద్ద దెబ్బ అనే విశ్లేషణలు తీసుకొస్తున్నారు. కానీ వాస్తవానికి మూడు రాజధానుల ప్రభావం టీడీపీపై పెద్దగా లేదని తెలుస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ మాదిరిగా ఈ రాజధానుల సెంటిమెంట్ ఏపీ ప్రజల్లో కనిపించడం లేదు. మొదట అమరావతినే రాజధానిగా పెట్టారు కాబట్టి, దాన్నే కొనసాగించాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

 

పైగా జ్యుడీషియల్ క్యాపిటల్ కానున్న కర్నూలుకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా లాంటి జిల్లాలకు విశాఖ చాలా దూరమైపోతుంది. దీంతో అక్కడి ప్రజలు అమరావతి రాజధానిగా ఉంటే బెటర్ అనుకుంటున్నారు. ఏదో వైసీపీ నేతలు దుష్ప్రచారం తప్పా…సీమలో టీడీపీకి వచ్చే నష్టమేమీ లేదు. మొన్న ఎన్నికల్లో ఏదో జగన్ గాలి వల్ల టీడీపీ గెలవలేదు గానీ, ఈ మూడు రాజధానుల ప్రభావం వల్ల భవిష్యత్‌లో టీడీపీకి నష్టం లేదు.

 

అటు ఉత్తరాంధ్రలో కూడా అనుకున్నంతగా మూడు రాజధానుల ప్రభావం లేదు. విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావడాన్ని స్వాగతిస్తున్నారు. కానీ దాన్ని వ్యతిరేకిస్తున్నా టీడీపీపై విశాఖ ప్రజలు ద్వేషం ఏమి పెంచుకోలేదు. స్థానిక సమస్యలని బట్టే అక్కడి ప్రజలు ముందుకెళ్తారు కాబట్టి, విశాఖలో బలంగా ఉన్న టీడీపీని కదపడం వైసీపీ వల్ల కాదు. ఇక ఈ మూడు రాజధానుల వల్ల…అమరావతికి దగ్గరగా ఉన్న కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో వైసీపీకే పెద్ద బొక్క పడుతుందేమో అని విశ్లేషుకులు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news