Gossipsబిగ్‌బాస్ 4లో జ‌బ‌ర్ద‌స్త్ నుంచి ఎవ‌రంటే...!

బిగ్‌బాస్ 4లో జ‌బ‌ర్ద‌స్త్ నుంచి ఎవ‌రంటే…!

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ రియాల్టీ షో సీజ‌న్ 4 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే ప్రోమోలు దుమ్ము రేపుతున్నాయి. ఇక నాగార్జున ప్రోమోల్లో ముస‌లివాడుగా క‌నిపించ‌డంతో పాటు గోపీ అన‌డంతో ఎవ‌రా ? గోపీ అన్న చ‌ర్చ‌లు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల విష‌యంలో కూడా ఇప్ప‌టికే లీకులు వ‌స్తున్నాయి. ఇక జ‌బ‌ర్ద‌స్త్ షో నుంచి కొంద‌రు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కృష్ణాన‌గ‌ర్లో వినిపిస్తోన్న టాక్ ప్ర‌కారం జ‌బ‌ర్ద‌స్త్ షోతో పాపుల‌ర్ అయిన ఆటో రామ్ ప్ర‌సాద్‌తో పాటు అవినాశ్ పేరు కూడా వినిపిస్తోంది.

 

ఈ వార్త‌ల‌ను బ‌ట్టి చూస్తే జ‌బ‌ర్ద‌స్త్ షో నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఒక‌రు ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక ఈ షోకు సంబంధించి ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోలోనే సెట్స్ వేస్తున్నారు. ఈ నెల 30 నుంచి బిగ్ బాస్ 4 ప్రార‌భ‌మ‌వుతుందంటున్నారు. ఈ సారి క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఎక్కువుగా ఇళ్ల‌లోనే ఉండ‌డంతో పాటు ఎంట‌ర్టైన్‌మెంట్ కోరుకోవ‌డంతో టీఆర్పీలు దుమ్ము రేపుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక కంటెస్టెంట్ల‌ను ముందు 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచాకే షోలోకి పంపుతార‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news