Moviesసుకుమార్ కోసం సైలెంట్‌గా ఫినిష్ చేసిన బన్నీ

సుకుమార్ కోసం సైలెంట్‌గా ఫినిష్ చేసిన బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం అల వైకుంఠపురములో ఇప్పటికే షూటింగ్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా బరిలో నిలిపేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది.

ఇక ఈ సినిమా పూర్తి కాకముందే బన్నీ తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కించనున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా బన్నీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సుకుమార్‌తో బన్నీ ముచ్చటగా మూడోసారి జతకడుతుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు అప్పుడే ఏర్పడ్డాయి.

ఈ సినిమాలోని క్యాస్టింగ్ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ కాకముందే బన్నీ తన నెక్ట్స్ మూవీని పట్టాలెక్కించడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అటు సంక్రాంతి బరిలో మహేష్‌తో పాటు బన్నీ పోటీ పడుతుండటంతో సంక్రాంతి విన్నర్ ఎవరా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news