సాయి పల్లవి ఫోటో లీక్..!

టాలీవుడ్ లో ఫిదా మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో వరుణ్ తేజ్ సరసన అచ్చం తెలంగాణ అమ్మాయిలా ఎంతో చలాకీగా నటించిన సాయి పల్లవికి తర్వాత వరుసగా తెలుగు, తమిళ, మళియాళ మూవీస్ లో ఛాన్సులు వస్తున్నాయి. సాయి పల్లవి తాను నటించే పాత్రల్లో ఎప్పుడూ వైవిద్యం ఉండేలా చూసుకుంటుంది.

నటనకు ప్రాధ్యానత ఉండాలని ఉండాలని కోరుకుంటుంది. ఇక లీడర్ మూవీతో హీరోగా వెండి తెరకు పరిచయం అయిన దగ్గుబాటి రానా కేవలం హీరోయిజం పైనే కాకుండా ఎలాంటి పాత్రలైనా నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక మూవీలో రానా ప్రతినాయకుడి పాత్రలో నటించి మెప్పించారు. తాజాగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ మూవీలో నటిస్తున్నారు.

ఈ మద్య స్టార్ హీరోలు, హీరోయిన్ల సినిమాలకు సంబంధించిన ఫోటోలు కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ కావడం దాంతో ఆ సినిమా ఏంటో అన్న విషయంపై సస్పెన్షన్ తొలగిపోవడం జరుగుతుంది. తాజాగా విరాలపర్వం కి సంబంధించిన ఓ లోకేషన్ లో సాయి పల్లవి సైకిల్ తొక్కుతూ రావడం కనిపిస్తుంది.

ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక సినిమా విషయానికి వస్తే 1992 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. 1990 నాటి రాజకీయ అంశలని దర్శకుడు ఆసక్తికరంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. రానా నక్సలైట్ గా, ఆ తర్వాత పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నట్లు టాక్.

sai-pallavi-jpg_710x400xt

Leave a comment