తారక్‌ పేరును కూడా వాడుకుంటున్న హీరో!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఇమేజ్‌ను వాడుకొని వివిధ కంపెనీలు లాభాలు పొందడం మనం చూశాం. ఇక ఎన్టీఆర్‌ను అంబాసిడర్‌గా పెట్టుకుని వివిధ ప్రోడక్టులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అటు కొంతమంది స్టార్ హీరోలు ఎన్టీఆర్‌ను తమ చిత్ర ప్రమోషన్స్‌లో వాడుకుని సినిమాపై అంచనాలు పెంచేందుకు ప్రయత్నించిన విషయం కూడా మనకు తెలుసు. కానీ ఓ హీరో ఏకంగా తారక్ పేరునే వాడుకొని సినిమా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఆ కథేంటో తెలుసుకుందామా.

నందమూరి కళ్యాణ్‌ రామ్ ఇటీవల 118 అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ మోస్తరు హిట్ అందుకున్నాడు. ఆ సినిమా చేస్తున్న సమయంలోనే తన నెక్ట్స్ మూవీని కూడా స్టార్ట్ చేశాడు. అయితే ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావడానికి చాలా టైమ్ పట్టింది. ఇప్పుడు ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉందట. అయితే ఈ సినిమాకు ఓ పవర్‌ఫుల్ టైటిల్ పెట్టాలనే ఉద్ధేశ్యంతో ఈ మూవీకి ‘తుగ్లక్’ అనే పేరును తొలుత అనుకున్నారు. కానీ కళ్యాణ్‌రామ్ ఆ టైటిల్‌కు బదులుగా ‘రావన్’ అనే టైటిల్‌ను పెట్టాల్సిందిగా కోరాడట. కథలో హీరో పాత్ర పవర్‌ఫుల్‌గా ఉందని.. దానికి తగ్గట్టుగానే టైటిల్‌ కూడా పవర్‌ఫుల్‌గా ఉండాలని ఆయన ఈ టైటిల్‌ను సజెస్ట్ చేశాడట. గతంలో తారక్ నటించిన ‘జై లవకుశ’ చిత్రంలో ‘రావన్’ పాత్ర సినిమాకే హైలైట్ అని అందరికీ తెలిసిందే. ఇక ‘‘రావణా…’’ అనే సాంగ్‌ ఒక ఊపు ఊపేసింది.

ఇప్పుడు తారక్ పాత్ర పేరును అడ్డం పెట్టుకుని సినిమా చేయాలని చూస్తు్న్న కళ్యాణ్ రామ్, తాను అనుకున్న హిట్ కొడతాడో లేదో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. ఏదేమైనా ‘రావన్’ పాత్రను ఇంత పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేసిన తారకా మజాకా అంటున్నారు జూనియర్ ఫ్యాన్స్.

Leave a comment