‘ ఇస్మార్ట్ శంక‌ర్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌.. రామ్ – పూరి టార్గెట్ ఇదే

టాలీవుడ్ డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన ఇస్మార్ట్ శంక‌ర్ బుధ‌వారం వ‌ర‌ల్డ్‌వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఛార్మీ నిర్మాత‌గా తెర‌కెక్కించిన ఈ సినిమా హిట్ అవ్వ‌డం అటు పూరీతో పాటు ఇటు రామ్‌కు అత్య‌వ‌స‌రం.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ట్రైల‌ర్లు, టీజ‌ర్లు సినిమాను యూత్‌కు క‌నెక్ట్ చేసేలా ఉన్నాయి. బోల్డ్ కంటెంట్‌, బూతు డైలాగులు, ఓవ‌ర్ ఎక్స్‌పోజింగ్‌తో సెన్సార్ వాళ్లు సైతం ఇస్మార్ట్‌కు ఏ స‌ర్టిఫికెట్ జారీ చేశారు. రామ్ డైలాగుల‌తో పాటు హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ ఓవ‌ర్ ఎక్స్‌పోజింగ్ చూస్తుంటే సినిమా ఓ వ‌ర్గాన్ని టార్గెట్‌గా చేసుకుని తీసిందే అన్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఇక వ‌ర‌ల్డ్‌వైడ్‌గా శంక‌ర్ రూ.17 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఏరియా వైజ్‌గా ఈ సినిమా బిజినెస్ వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.18 కోట్ల షేర్ రాబ‌ట్టాల్సి ఉంది.

ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్ ( రూ.కోట్ల‌లో)

నైజాం – 6.50

సీడెడ్ – 2.52

వైజాగ్ – 1.40

ఈస్ట్ – 1.05

వెస్ట్ – 0.90

కృష్ణా – 0.95

గుంటూరు – 1.10

నెల్లూరు – 0.48
—————————————
ఏపీ + తెలంగాణ = 14.90 కోట్లు
—————————————

రెస్టాఫ్ ఇండియా – 1.20

రెస్టాఫ్ వ‌ర‌ల్డ్ – 0.90
————————————————–
వ‌ర‌ల్డ్‌వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ = 17 కోట్లు
—————————————————

Leave a comment