మూవీస్ కి గుడ్ బాయ్ అంటున్న నటి హేమ!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో కామెడీ పాత్రల్లో నటించిన హేమ తాజాగా మూవీస్ కి గుడ్ బాయ్ చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్క, చెల్లి, వొదిన లాంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హేమ సినిమాల్లోనే కాదు బయట తన సంచలన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా నిలిచేంది.

ఆ మద్య మా అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా నటి హేమ చేసి హడావుడి సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టించింది. హేమ గ‌తంలో నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి స్థాపించిన ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీలో చేరి ఆ పార్టీకి త‌న వంతు ప్ర‌చారం చేశారు.

అయితే ఇప్పుడే ఏపిలో వైసీపీ పాలనలో ఉండటంతో ఆమె పూర్తిగా రాజకీయా వైపు వెళ్లాలను చూస్తున్నట్లు సమాచారం. రాజ‌మండ్రిలో ఇల్లు క‌ట్టించుకున్న‌ట్టు తెలిపిన ఆమె అది పూర్తి కాగానే, సినిమా ప‌రిశ్ర‌మ‌ని వదిలి బాహ్య ప్రపంచంలోకి వస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు టాలీవుడ్ లో కొత్త నటులకు ఎక్కువగా ప్రోత్సహించడం జరుగుతుంది..దాంతో సీనియర్స్ కి ఎక్కువగా ఛాన్సులు రాకపోవడం ఒక కారణం అయి ఉండొచ్చని భావిస్తున్నారు టాలీవుడ్ వర్గం.

Leave a comment