బోయపాటితో అల్లు అరవింద్.. అదిరిపోయే సినిమా..!

టాలీవుడ్ మాస్ అండ్ కమర్షియల్ డైరక్టర్ బోయపాటి ఇన్నేళ్లు తన సినిమాలతో తెచ్చుకున్న క్రేజ్ కాస్త వినయ విధేయ రామ అనే ఒక్క సినిమాతో పోగొట్టుకున్నాడు. అందుకే తనకు రెండు సినిమాలు సూపర్ హిట్లు ఇచ్చిన బాలకృష్ణ కూడా బోయపాటి సినిమా గురించి ఆలోచనలో పడ్డాడు. ప్రస్తుతం బోయపాటి నెక్స్ట్ సినిమా ఏది అనే ఆలోచనలో ఉండగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఆడియెన్స్ మాస్ పల్స్ తెలుసుకున్న బోయపాటి శ్రీను ఊర మాస్ సినిమాలను చేస్తాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తీసిన సరైనోడు బన్నికి మంచి మాస్ మైలేజ్ వచ్చేలా చేసింది. అయితే ఈసారి అల్లు అరవింద్ బోయపాటితో చేసే సినిమాలో హీరో ఎవరై ఉండొచ్చు అంటే అతనెవరో కాదు కార్తికేయనే అంటున్నారు కొందరు. గుణ 369 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లిన అల్లు అరవింద్ వెల్ కం టూ గీతా ఆర్ట్స్ అనేశాడు.

సో బోయపాటితో అల్లు అరవింద్ చేసే సినిమాలో కార్తికేయనే హీరో అని ఫిక్స్ అవుతున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది. కచ్చితంగా బోయపాటి ఈ సినిమా చాలా జాగ్రత్తగా తీస్తాడు. తనలోని కసి మొత్తం చూపించేలా స్క్రిప్ట్ నుండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట బోయపాటి.

Leave a comment