బిగ్ బాస్ హీట్.. నాగార్జున వాట్ టూ డూ..!

స్టార్ మా నిర్వహిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో రెండు సీజన్లలో ఎప్పుడూ షో నడుస్తుండగా.. చివరి దశల్లో వివాదాస్పందంగా మారేది. కాని బిగ్ బాస్ సీజన్ 3 మొదలవ్వకముందే చిక్కుల్లో పడ్డది. యాంకర్ శ్వేతా రెడ్డి బిగ్ బాస్ లో కాస్టింగ్ కౌచ్ అంటూ ఓ కొత్త వివాదాన్ని లేపగా దాన్ని కొనసాగిస్తూ కొందరు ఇదే విధమైన కామెంట్స్ తో వివాదాలు సృష్టిస్తున్నారు. ఇదిలాఉంటే జూలై 21 నుండి బిగ్ బాస్ సీజన్ 3 మొదలు కాబోతుంది.

ఈ షోపై కాస్టింగ్ కౌచ్ గొడవ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి చేరింది. అక్కడ స్టూడెంట్ లీడర్స్ ఇదో సోషల్ ఇష్యూ అంటూ ఈ షోని తప్పనిసరిగా ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కాదు కూడదని షో చేస్తే హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ఇంటి మీద, బిగ్ బాస్ సెట్ మీద దాడి చేస్తామని అంటున్నారు. బిగ్ బాస్ కేవలం తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో వస్తుంది.

మరి ఎక్కడ రాని ఈ కాస్టింగ్ కౌచ్ వివాదం కేవలం తెలుగులో ఎందుకు వచ్చిందో తెలియాల్సి ఉంది. అయితే ఇష్యూ స్టూడెంట్స్ దాకా వెళ్లడంతో ఈ షో చేసేందుకు నాగార్జున వెనుకడుగు వేస్తున్నాడట. స్టార్ హీరోగా తన ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఏదైనా చర్యలకు పాల్పడతారేమో అని డౌట్ పడుతున్నాడట. మరి నాగార్జున ఏం చేస్తాడో చూడాలి.

Leave a comment