Gossipsనాని జెర్సీతో ఎన్.టి.ఆర్ కు ఈక్వల్ అయ్యాడు..!

నాని జెర్సీతో ఎన్.టి.ఆర్ కు ఈక్వల్ అయ్యాడు..!

నాచురల్ స్టార్ నాని, గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ అందుకున్న సినిమా జెర్సీ. లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల హవా కొనసాగిస్తుంది. సినిమాలో నాని నటనకు అందరు ఫిదా అవుతున్నారు. గౌతం డైరక్షన్ టాలెంట్ కూడా అందరికి అర్ధమయ్యేలా చేసింది. జెర్సీ సినిమాతో నాని రేర్ ఫీట్ సాధించాడు. ఈ సినిమాతో యూఎస్ బాక్సాఫీస్ లో నాని 1 మిలియన్ మార్క్ సినిమాల సంఖ్య 6కి చేరింది.

ఈగ నుండి జెర్సీ వరకు నాని నటించిన 6 సినిమాలు యూఎస్ లో మిలియన్ మార్క్ అందుకున్నాయి. ఎన్.టి.ఆర్ కూడా తన కెరియర్ లో 6 సినిమాలు మిలియన్ మార్క్ దాటాయి. ఇప్పుడు ఎన్.టి.ఆర్ కు సమానంగా నాని కూడా 6 సినిమాలు 1 మిలియన్ మార్క్ అదుకున్నాయి. నాని కెరియర్ లో ఈగ, భలే భలే మగాడివోయ్, ఎం.సి,ఏ, నిన్ను కోరి, నేను లోకల్, జెర్సీ ఇలా ఆరు సినిమాలు యూఎస్ లో బాక్సాఫీస్ పై మిలియన్ మార్క్ అందుకున్నాయి.

అయితే ఎన్.టి.ఆర్ రేంజ్ వేరు.. నాని రేంజ్ వేరు.. మిలియన్ మార్క్ లో ఎన్.టి.ఆర్ ను ఈక్వల్ చేసినా ఎన్.టి.ఆర్ రేంజ్ కు నాని చేరుకోవడం కొంత కష్టమే. నాని జెర్సీతో నటుడిగా మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం నాని విక్రం కుమార్ డైరక్షన్ లో గ్యాంగ్ లీడర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో మూవీ చేయనున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news