” బుల్లెట్ మీదొచ్చె బుల్ రెడ్డి “.. ఐటం సాంగ్ లో పాయల్ రచ్చ..!

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ డైరక్షన్ లో వస్తున్న సినిమా సీత. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆరెక్స్ 100 బ్యూటా పాయల్ రాజ్ పుత్ స్పెషల్ ఐటం సాంగ్ చేసింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి అంటూ స్పెషల్ సాంగ్ టీజర్ లో దుమ్ముదులిపేసింది పాయల్ రాజ్ పుత్. ఆరెక్స్ 100తో యూత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న పాయల్ ఈ ఐటం తో మరింత రెచ్చిపోతుంది.

సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఈ సాంగ్ ఉంది. బుల్లెట్ మీదొచ్చె బుల్ రెడ్డి అంటూ పాయల్ తన అందాలతో అదరగొట్టింది. హీరోయిన్ గా కాజల్ ఎలా నటించిందో తెలియదు కాని ఐటం సాంగ్ మాత్రం కచ్చితంగా సినిమాకు స్పెషల్ క్రేజ్ తెచ్చేలా ఉంది. రీసెంట్ గా వచ్చిన సీత టీజర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది.

నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన తేజ ఎన్.టి.ఆర్ బయోపిక్ కాదని చెప్పి మరి వచ్చి బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు. ఈ నెల చివరన రిలీజ్ ప్లాన్ చేస్తున్న సీత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Leave a comment