Newsతాత కాబోతున్న నాగార్జున.. కాని ఇక్కడ చిన్న ట్విస్ట్..!

తాత కాబోతున్న నాగార్జున.. కాని ఇక్కడ చిన్న ట్విస్ట్..!

కింగ్ నాగార్జున తాత కాబోతున్నాడన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య 2017 అక్టోబర్ లో సమంతను పెళ్లాడాడు. వారిద్దరు పెళ్లి తర్వాత సినిమాలను చేస్తూనే ఖాళీ టైం లో జాలీ ట్రిప్ లు వేస్తున్నారు. ఇక ఫైనల్ గా అక్కినేని ఇంట వారసుడిని తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అయితే అంతకుముందే నాగార్జున తాత అవ్వబోతున్నాడట. అదెలా అంటే అది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో నాగార్జున తాతగా కనిపించనున్నాడని తెలుస్తుంది.

నాగార్జున, కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా సీక్వల్ గా బంగార్రాజు సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు నాగార్జున. స్క్రిప్ట్ ఆల్రెడీ పూర్తవగా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో నాగార్జున తాతగా నటిస్తాడని తెలుస్తుంది. సినిమాలో నాగ చైతన్య కూడా ఉంటాడట. ఇక మిగతా కాస్ట్ అండ్ క్రూ డీటైల్స్ తెలియాల్సి ఉంది.

మొత్తానికి రీల్ లైఫ్ లో తాతగా నాగార్జున ప్రేక్షకులను అలరించనున్నాడు. ఎలాగు త్వరలో రియల్ లైఫ్ లో తాత రోల్ చేయాల్సి ఉంది కాబట్టి శాంపిల్ గా సినిమాల్లో ఆ అనుభవాన్ని తెచ్చుకుంటాడని అంటున్నారు. ఈమధ్య అక్కినేని వారి సినిమాల సందడి అంతగా మెప్పించడం లేదు. బంగార్రాజు అయినా అంచనాలను అందుకునేలా ఉంటుందని ఆశిస్తున్నారు అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news