Newsపాతికేళ్ల తర్వాత సూపర్ స్టార్ అలాంటి రోల్..!

పాతికేళ్ల తర్వాత సూపర్ స్టార్ అలాంటి రోల్..!

సౌత్ లో సూపర్ స్టార్ రజిని అంటే విపరీతమైన క్రేజ్.. ఆయన సినిమా తమిళంతో పాటుగా తెలుగులో కూడా అదే రేంజ్ లో రిలీజ్ అవుతాయి.. సినిమా బాగుంటే అదే విధంగా వసూళ్లు సాధిస్తాయి. రీసెంట్ గా వచ్చిన పేట సినిమా కూడా పర్వాలేదు అనిపించుకున్న రజిని మురుగదాస్ డైరక్షన్ లో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో రజిని పోలీస్ పాత్రలో నటిస్తాడని తెలుస్తుంది. ఇందులో విశేషం ఏముంది అంటే రజినికాంత్ పోలీస్ పాత్రలో చేసి పాతికేళ్లు పైగా అయ్యిందట. 27 ఏళ్ల కిందట వచ్చిన పాండియన్ సినిమాలో రజిని పోలీస్ గా నటించారు.

ఇక ఇన్నేళ్ల తర్వాత మురుగదాస్ డైరక్షన్ లో రజిని పవర్ ఫుల్ పోలీస్ గా నటిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో పొలిటికల్ కాన్సెప్ట్ కూడా ఉంటుందట. సినిమా చివర్లో హీరో పొలిటికల్ టర్న్ తీసుకుంటాడట. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో మురుగదాస్ ఈ సినిమా కథ రాసుకున్నాడట. స్పైడర్ తర్వాత సర్కార్ సినిమాతో హిట్ అందుకున్న మురుగదాస్ రజిని సినిమా చాలా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

రజిని సినిమా యావరేజ్ అయినా కూడా తమిళంలో సూపర్ హిట్ కలక్షన్స్ రాబడుతుంది. సంక్రాంతికి వచ్చిన పేట సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా వసూళ్ల పరంగా 100 కోట్లు దాటేసింది. తమిళనాడులో రజిని స్టామినా ప్రూవ్ చేసుకున్న పేట తెలుగులో 12 కోట్ల బిజినెస్ మాత్రమే చేసింది. అయితే సంక్రాంతి సీజన్ కు కాకుండా వేరే టైం లో వస్తే తెలుగులో కూడా బాగా ఆడేదని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news