Gossipsవరుణ్ తేజ్ 'వాల్మీకి'కు బెదిరింపులు..కాదు కూడదంటే సినిమా అడనివ్వం..!

వరుణ్ తేజ్ ‘వాల్మీకి’కు బెదిరింపులు..కాదు కూడదంటే సినిమా అడనివ్వం..!

హరీష్ శంకర్ డైరక్షన్ లో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా వాల్మీకి. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్తండా రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈమధ్యనే ఆ సినిమా తెలుగు రీమేక్ ఓపెనింగ్ చేశారు. సినిమాకు టైటిల్ గా వాల్మీకి అని పెట్టారు. అంతేకాదు టైటిల్ పోస్టర్ లో తుపాకి కూడా ఉంది. ఆ పోస్టర్ పై అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారు వాల్మీకి సామాజిక వర్గ నేతలు. కుటుంబ బంధాన్ని వివరించేలా రామాయణ మహాకావ్యం రాసిన వాల్మీకిని ఎలా సినిమా టైటిల్ గా వాడతారని వాల్మీకి సామాజిక వర్గన్ నేత సాయి ప్రసాద్ ఆరోపిస్తున్నారు.

తమ సామాజిక వర్గాన్ని వ్యక్తపరిచేలా ఆ టైటిల్ ఉందని.. అందులో గన్ పెట్టి మరింత బాధపెట్టారని వెంటనే చిత్రయూనిట్ ఆ టైటిల్ తో పాటుగా సినిమాలో వాల్మీకి అన్న పేరు కూడా వాడకూడదని డిమాండ్ చేస్తున్నారు. కాదు కూడదని సినిమా పూర్తి చేస్తే రిలీజ్ టైంలో అయినా అల్లర్లు చేస్తామని చెప్పాడు సాయి ప్రసాద్. ఒకప్పుడు వాల్మీకికి చెందిన వారు ఫ్యాక్షనిస్టులుగా ఉన్నారని అయితే ఇప్పుడు వారు అదంతా మానేసి ఎవరి పనులు వారు చేసుకుంటున్నారని చెప్పాడు.

మరి సాయి ప్రసాద్ బెదిరింపులకు హరీష్ శంకర్ అండ్ టీం టైటిల్ మార్చుతారా లేక అలానే కొనసాగిస్తారా అన్నది వేచి చూడాలి. ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాకు సంబందించిన మిగతా స్టార్ కాస్ట్ ఇంకా వెళ్లడించలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news