Gossips'మెగా' వార్ ! చెర్రీకే దెబ్బేసిన వరుణ్ తేజ్

‘మెగా’ వార్ ! చెర్రీకే దెబ్బేసిన వరుణ్ తేజ్

మెగా హీరోల సందడి సిల్వర్ స్క్రీన్ మీద బాగా పెరిగిపోయింది. రాంచరణ్, బన్నీ, శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్, ఇప్పుడు కొత్తగా వైష్ణవ్ తేజ్ ఇలా మెగా హీరోల లిస్ట్ చాలా పెద్దదయిపోయింది. ఇంకేముంది బయట హీరోల సినిమాల మధ్య పోటీ ఎలా ఉన్నా … ఈ మెగా హీరోల మధ్య పోటీ అనేది ఎక్కువ అయిపొయింది. సంక్రాంతి పండుగ కి విడుదల అయిన మెగా హీరో ల సినిమాలు ఒకరికి కిక్ ఇవ్వగా మరొకరికి చేదు ఫలితాన్ని మిగిల్చింది.

వరుణ్ తేజ్ న‌టించిన ‘ఎఫ్2’ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించగా… రామ్ చ‌ర‌ణ్ ‘విన‌య విధేయ రామ’కు షాక్ ఇచ్చింది. వ‌రుణ్ తేజ్‌కు ఈ విష‌యంలో ఏదో ఒక వరం ఉన్నట్లుంది. అందుకే వరుణ్ స్టార్ డమ్ తో సొంతంగా హిట్ కొట్టలేకపోయినా… ఏదో ఒక రూపంలో ఆయన నటించిన సినిమా హిట్ టాక్ తెచ్చుకుని వరుణ్ కెరియర్ కి డోఖా లేకుండా చేస్తున్నాయి.

గతేడాది సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ఇంటలిజెంట్ సినిమాతో పోటీ పడ్డాడు వరుణ్ తేజ్. అప్పుడు వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఇంటలిజెంట్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ తొలిప్రేమతో సాయిని ఓడించాడు మెగా వారసుడు. ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ సినిమానే వెనక్కి నెట్టిసి ముందువరసలోకి వచ్చేసాడు వరుణ్.

ఎఫ్2 సినిమాను కూడా ఎవరు తక్కువగా అంచనా వేయలేదు. అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో కచ్చితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ సృష్టించడం ఖాయమని నమ్మకంతోనే ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు కూడా. ఇప్పుడు ఇదే జరిగింది. బోయపాటి శ్రీను తెరకెక్కించిన వినయ విధేయ రామ 95 కోట్ల‌కు కేవ‌లం 62 కోట్లు వ‌సూలు చేస్తే.. 35 కోట్ల బిజినెస్ చేసిన ఎఫ్2 ఇప్ప‌టి వ‌ర‌కు 61 కోట్ల షేర్ తీసుకొచ్చి.. 70 కోట్ల వరకు వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news