Gossipsరాజమౌళి ని టచ్ చేయలేకపోయినా శంకర్..!

రాజమౌళి ని టచ్ చేయలేకపోయినా శంకర్..!

శంకర్, రజిని కాంబోలో వచ్చిన 2.ఓ బాహుబలి రికార్డులనే టార్గెట్ పెట్టుకుందన్న విషయం తెలిసిందే. బాహుబలి మొదటి రెండు పార్టుల్లో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త సంచలనాలు సృష్టించింది. రోబో సీక్వల్ గా వస్తున్న 2.ఓ బాహుబలి రికార్డులను పక్కన పెట్టడం ఖాయమని అనుకున్నారు. కాని బాహుబలి రికార్డులు సేఫ్ అని తెలుస్తుంది.

యూఎస్ ప్రీమియర్ స్లో బాహుబలి 2 3.5 మిలియన్ డాలర్స్ వసూళు చేయగా 2.ఓ అంతకన్నా తక్కువే రాబట్టిందని అంటున్నారు. అయితే 2.ఓ ప్రీమియర్ కలక్షన్స్ రివీల్ చేయట్లేదు దర్శక నిర్మాతలు. అంతేకాదు 2.ఓ మొదటి రోజు కలక్షన్స్ కూడా ఇంకా వెళ్లడించలేదు. బాహుబలిని బీట్ చేసే సత్తా ఉన్న సినిమాగా వచ్చిన 2.ఓ ఆ సినిమా రికార్డుల ముందు నిలబడలేకపోయింది.

భారీ అంచనాలతో వచ్చినా అక్కడక్కడ మిక్సెడ్ టాక్ సినిమాను వెనక్కి నెట్టేస్తున్నాయి. వీకెండ్ లో ఎంత తెస్తుంది అన్నది అంచనా వేయలేకపోతున్నారు ట్రేడ్ పండితులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news