Moviesరజినీకాంత్ 2.0 మూవీ రివ్యూ & రేటింగ్

రజినీకాంత్ 2.0 మూవీ రివ్యూ & రేటింగ్

సినిమా : 2.0
నటీనటులు : రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్, తదితరులు
రచన-దర్శకత్వం : శంకర్
నిర్మాత : సుబాస్కరణ్
సంగీతం : ఏఆర్ రెహమాన్
బ్యానర్ : లైకా ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్ : 29-11-18

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ 2.0 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో వచ్చిన టెక్నికల్ వండర్ రోబో చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న మరో విజువల్ వండర్‌గా 2.0 ఎక్కడలేని క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ సినిమాతో భారత చలనచిత్ర రికార్డులకు ఎసరుపెట్టడం ఖాయం అని యావత్ సినీ లవర్స్ అనుకుంటున్నారు. అతిభారీ అంచనాల నడుము తెరకెక్కిన 2.0 ఎట్టకేలకు నేడు థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది. మరి ఈ విజువల్ వండర్ మూవీ జనాలను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ:
2.0 చిత్ర కథ మొత్తం ఒక సామాజిక అంశంపై తెరకెక్కింది. సెల్‌ఫోన్‌ల కారణంగా పర్యావరణంలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో ఈ సినిమా ముఖ్య కథ. ఇక సినిమా కథలోకి వెళ్తే.. టెక్నాలజీ కారణంగా పక్షులు అంతరించిపోతుంటాయి. ఇది నచ్చని ఒక పక్షిప్రాణి అయిన వృద్ధుడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇదిలా ఉండగానే నగరంలోని అన్ని సెల్‌ఫోన్‌లు వాటంతట అవే ఎగురుకుంటూ వెళ్లి ఒక రాక్షస పక్షి అవతారంలోకి మారుతాయి. ఈ పరిణామానికి అసలు కారణం తెలుసుకునేందుకు వసీ(రజినీకాంత్) మరియు అతడి లేడీ రోబోట్ వెన్నెల(అమీ జాక్సన్) ప్రయత్నిస్తుంటారు. ఇంతలోనే వరుసగా కొన్ని హత్యలు జరుగుతుంటాయి. ఇది కూడా రాక్షసపక్షి కారణంగా జరిగాయని తెలుసుకుని మిలిటరీ సహాయంతో వసీ తన రోబోట్ చిట్టిని రంగంలోకి దింపుతాడు. రాక్షసపక్షి వెనకాల అక్షయ్ కుమార్ ఉన్న విషయం వారు తెలుసుకుంటారు. అయితే అతడి శక్తిముందు చిట్టి పవర్ తక్కువగా ఉంటుంది. దీంతో వసీ చిట్టీని 2.0గా రీలోడ్ చేస్తాడు. కట్ చేస్తే అక్షయ్ కుమార్ అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకునేందుకు వసీ అండ్ టీమ్ ప్రయత్నిస్తుంది. ఇక అక్షయ్‌ చేసే ఈ దారుణాలను ఆపేందుకు చిట్టి 2.0తో ఎలా అరికట్టాడు? అసలు అక్షయ్ ఇలా ఎందుకు చేస్తున్నాడు? చివరకు అక్షయ్ ఏమవుతాడు? అనేది చిత్ర కథ.

3
నటీనటుల ప్రతిభ :

సూపర్ స్టార్ రజిని ఇమేజ్ కు తగినట్టుగా 2.ఓ ఉంది. చివరి 30 నిమిషాల్లో రజిని ఫ్యాన్స్ కు నచ్చేలా అద్భుతమైన హీరోయిజం చూపించారు. ఇక రజిని కూడా తన స్టైల్ తో ఆకట్టుకున్నాడు. సినిమాలో మరో ముఖ్య పాత్ర పక్షిరాజు అక్షయ్ కుమార్ దే.. అక్షయ్ మేకప్.. చేసిన విధ్వసం అంతా ఇంతా కాదు. పర్ఫెక్ట్ విలన్ గా అక్షయ్ అదరగొట్టాడు. ఇక ఎమీ జాక్సన్ కూడా తన పాత్ర పరిధి మేరకు మెప్పించింది. ఐశ్వర్య రాజ్ సడెన్ గా మెరుస్తుంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

2.ఓ రెహమాన్ మరోసారి తన సత్తా చాటాడు. బిజిఎం ది బెస్ట్ అనిపించాడు. సాంగ్స్ కూడా బాగున్నాయి. నిరవ్ షా సినిమాటోగ్రఫీ బాగుంది. ఆంటోనీ ఎడిటింగ్ బాగుంది. శంకర్ కథ, కథనాలు సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. సుజత డైలాగ్స్ ఓకే అనేలా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవలేదని తెలుస్తుంది. వి.ఎఫ్.ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి.
2
విశ్లేషణ :

రోబో సీక్వల్ గా వచ్చిన 2.ఓపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకునేలా సినిమా ఉంది. ముఖ్యంగా విజువల్ పరంగా సినిమా హాలీవుడ్ ట్రీట్ ఇస్తుంది. అద్భుతమైన గ్రాఫిక్స్ వర్క్ తో సినిమా తెరకెక్కించాడు. రజిని ఇమేజ్ ను సరిగా వాడుకున్నాడు. ఇక సినిమాలో విలన్ గా చేసిన అక్షయ్ ను వందశాతం వాడేశాడు శంకర్.

పక్షి రాజాగా అక్షయ్ అద్భుతాలు చేశాడు. అతని రూపం.. అతను చేసే విధ్వంసం బాగా చూపించారు. సినిమా విజువల్ గా గ్రాండియర్ గా ఉన్నా కథ కాస్త ఆశించిన స్థాయిలో లేదని చెప్పొచ్చు. రజిని, అక్షయ్ కుమార్ ల సీన్స్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. కచ్చితంగా సినిమా ఆడియెన్స్ ను థ్రిల్ అయ్యేలా చేస్తుంది.

అమీ జాక్సన్ అందాలు సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమాకు రెహమాన్ ప్రాణం పోశాడు. సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో శంకర్ అంచనాలకు తగిన అవుట్ పుట్ ఇచ్చాడని చెప్పొచ్చు.
1
ప్లస్ పాయింట్స్ :

రజినికాంత్, అక్షయ్ కుమార్

విఎఫెక్స్

మ్యూజిక్

ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్ :

డైలాగ్స్

అర్ధం కాని కొన్ని సీన్స్

బాటం లైన్ :

రోబోకి పర్ఫెక్ట్ సీక్వల్ 2.ఓ.. శంకర్ మరోసారి సత్తా చాటాడు..!

రేటింగ్ : 3.5/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news